హానీమూన్ లో చై - సామ్ లు

Update: 2018-03-29 09:51 GMT

టాలీవుడ్ లవ్ బర్డ్స్ అయిన నాగ చైతన్య - సమంత లు ప్రస్తుతం హానీమూన్ ని ఎంజాయ్ చేస్తున్నారు. పెళ్లి తర్వాత ఎవరి షూటింగ్స్ లో వారు బిజీగా మారిపోయి హానీమూన్ ని ఎంజాయ్ చేయలేకపోయినా ఈ ప్రేమికులు...అక్టోబర్ లో పెళ్లి అయ్యాక మళ్లీ ఇన్నాళ్ళకి హానీమూన్ ని ప్లాన్ చేసుకున్నారు. అటు సామ్ ఇటు చైతులు తాము చేస్తున్న సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చేసి ఇలా హానీమూన్ కి ఎగిరిపోయారు. పెళ్లయ్యాక రెండు మూడు రోజులు మాత్రమే వెకేషన్స్ ని ఎంజాయ్ చేసిన ఈ జంట ఇప్పుడు కాస్త లాంగ్ వెకేషన్ ని తీసుకుని మరి ఎంజాయ్ చేస్తున్నారు.

అమెరికాలోని మియామి మ్యూజిక్ ఫెస్టివల్ కు ఈ యంగ్ కపుల్స్ రెక్కలు కట్టుకుని మరి ఎగిరిపోయారు. దాదాపు 15 రోజులకు పైగానే ఈ జంట తమ హానీమూన్ వెకేషన్ ను ఎంజాయ్ చేయనుంది. మరి అక్కడ వాళ్ళెంత బాగా ఎంజాయ్ చేస్తున్నారనే విషయం మాత్రం మనకి ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా తెలిసిపోతూనే ఉంటుంది. ఇప్పటికే చై, సామ్ జంట మియామి వీధుల్లో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ తమ మధుర క్షణాల్ని ఎంజాయ్ చేస్తున్న ఒక పిక్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మరి ఆ పిక్ లో సమంత, నాగ చైతన్య ఎంత సంతోషంగావున్నారో మీరే చూడండి.

ఇకపోతే సమంత టాలీవడ్ లో నటించిన రంగస్థలం రేపు శుక్రవారమే విడుదల కాబోతుండగా.. మహానటి షూటింగ్ కూడా పూర్తి చేయూసుకుంది. అలాగే సమంత నటిస్తున్న మరో చిత్రం యూటర్న్ ప్రస్తుతం సెట్స్ మీదుంది. ఇక నాగ చైతన్య నటిస్తున్న సవ్యసాచి షూటింగ్ ఎండింగ్ స్టేజ్ కి రాగా మారుతీ డైరెక్షన్ లో చేస్తున్న శైలజ రెడ్డి అల్లుడు సినిమా సెట్స్ మీదుంది. అలాగే తన భార్య సామ్ తో కలిసి ప్రేయసి అనే సినిమాని కూడా పట్టాలెక్కించే పనిలో ఉన్నాడు చైతు.

Similar News