హరీష్ శంకర్ పేరు వింటే ఫైర్ అవుతున్న బండ్ల!

పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ తీసిన తరువాత హరీష్ శంకర్ కి మంచి పేరు వచ్చింది. చాలామంది ఇతన్ని మెచ్చుకున్నారు కూడా. కానీ ఆ సినిమా [more]

Update: 2020-05-19 04:37 GMT

పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ తీసిన తరువాత హరీష్ శంకర్ కి మంచి పేరు వచ్చింది. చాలామంది ఇతన్ని మెచ్చుకున్నారు కూడా. కానీ ఆ సినిమా ప్రొడ్యూసర్ అయినా బండ్ల గణేష్ మాత్రం హరీష్ పేరు చెబితే విరుచుకుపడుతున్నారు. వివరాల్లోకి వెళ్తే..

హరీష్ శంకర్, గణేష్ ల మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ బండ్ల మాత్రం హరీష్ పేరు వింటే ఫైర్ అవుతున్నాడు.  సోషల్ మీడియా వేదికగా ఇద్దరి మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది. గబ్బర్ సింగ్ చిత్రయూనిట్‌ ను తలుచుకుంటూ హరీష్ శంకర్ విడుదల చేసిన లెటర్‌లో బండ్ల గణేష్ పేరు లేకపోవడంతో అక్కడ నుండి వివాదం స్టార్ట్ అయింది. బండ్ల గణేష్…హరీష్ శంకర్ ని రీమేక్ దర్శకుడు అంటూ, ‘విస్తరాకు’, ‘ఎంగిలాకు’ అంటూ కామెంట్స్ చేసాడు.

పైగా ఓ ఇంటర్వ్యూ లో కూడా బండ్ల…హరీష్ తో ఇంక సినిమాలు చేయను అంటూ క్లారిటీ ఇచ్చేసాడు. మరి ఇద్దరి మధ్య అంత గొడవ అవ్వడానికి కారణం ఏంటో ఇంకా తెలియాల్సిఉంది.

Tags:    

Similar News