హనుతో మరొక చిత్రం చేయనున్న నాచురల్ స్టార్

Update: 2017-04-22 11:32 GMT

వరుస విజయాలతో కెరీర్ ని జోరుగా సాగిస్తున్న నాచురల్ స్టార్ నాని నేను లోకల్ వంటి మ్యాసివ్ హిట్ తరువాత పరిచయ దర్శకుడు శివ దర్శకత్వంలో నిన్ను కోరి అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ దాదాపుగా తుది దశకి చేరుకుంది. ఈ చిత్రం పూర్తయిన వెంటనే దిల్ రాజు నిర్మాణంలో ఓ మై ఫ్రెండ్ ఫేమ్ డైరెక్టర్ వేణు శ్రీ రామ్ దర్శకత్వంలో మొదలు కానున్న ఎం.సి.ఏ అనే చిత్రం ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో వుంది. కాగా నాని ఈ చిత్రంతో పాటు మరో ప్రాజెక్ట్ ని కూడా లైన్ లోపెట్టుకుని తన జోరు కొనసాగిస్తున్నాడు. ఎం.సి.ఏ అనంతరం తనకి కృష్ణ గాడి వీర ప్రేమగాధ చిత్రంతో విజయాన్ని ఇచ్చిన దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వంలో మరో చిత్రం చేయబోతున్నాడు నాని.

అందాల రాక్షసి తో దర్శకుడిగా పరిచయమై తొలి చిత్రంతోనే వైవిధ్య ప్రేమ కథలు తెరకెక్కించే ప్రతిభాశాలిగా ముద్ర వేయించుకున్న హను రాఘవపూడి ముందుగా నవీన్ చంద్ర పోషించిన సూర్య పాత్రని నాని కి నెరేట్ చేయగా అప్పటికి అంత రఫ్ ఇమేజ్ లేని కారణంగా పాత్ర నిలబడటానికి ఎవరైనా ఫ్రెష్ పేస్ ప్రయత్నించమని హను కి సలహా ఇచ్చాడట నాని. ఆలా వారి కాంబినేషన్ అప్పటికి మిస్ ఆయై కృష్ణ గాడి వీర ప్రేమ గాధ తో ప్రేక్షకులని అలరించింది. ప్రస్తుతం నితిన్ హీరోగా లై అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న హను రాఘవపూడి 'అదిగో అల్లదిగో' పేరుతో నాని హీరోగా చేయబోయే చిత్రానికి స్క్రిప్ట్ పనులు పూర్తయిన వెంటనే ప్రారంభించనున్నాడు. ఈ ఏడాది డిసెంబర్ నెలలో ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది.

Similar News