స్పైడర్ తో అప్సెట్ అయ్యాడా?

Update: 2017-10-02 13:00 GMT

మహేష్ బాబు తాజా చిత్రం స్పైడర్ ఈ దసరాకి విడుదలై తెలుగులో మిక్స్డ్ టాక్, తమిళంలో పాజిటివ్ టాక్ తెచ్చుకుని... కలెక్షన్స్ కొల్లగొడుతుంది. మహేష్ బాబు ఏడాది కి పైమాటే స్పైడర్ కోసం కష్టపడ్డాడు. పేరున్న డైరెక్టర్... ఎంత ఖర్చయినా భరించే నిర్మాతలు... పేరున్న హీరోయిన్... మొదటిసారి మహేష్ కోసం విలన్స్ గా మారిన సూర్య, భరత్ లు ఇలా అన్ని విషయాల్లోనూ ఎంతో పర్ఫెక్ట్ గా తెరకెక్కిన స్పైడర్ చిత్రం ఫలితంలో మహేష్ కొద్దిగా అప్సెట్ అయ్యాడనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి. తన మీద నమ్మకంతో భారీ బడ్జెట్ పెట్టిన నిర్మాతలుకు ఈ సినిమా డివైడ్ టాక్ లాస్ వస్తుందేమో అని మహేష్ మధనపడుతున్నాడట.

మరి గత సినిమాలు ప్లాప్ అయినా తనకి మార్కెట్ మాత్రం ఏ రేంజ్ లో ఉందొ అనేది స్పైడర్ బట్టి తెలిసింది మహేష్ కి. అయితే మహేష్ అంతలా మదనపడాల్సిన అవసరమే లేదంటున్నారు. ఎందుకంటే స్పైడర్ కి ఏ టాక్ వచ్చినా కూడా సినిమా బాక్సాఫీసు వద్ద మంచి కలెక్షన్స్ కొల్లగొడుతుంది. ఎందుకంటే దసరా సెలవలు ఈ సినిమా కలెక్షన్స్ కి బాగానే కలిసొచ్చాయి. సినిమా ఎలా వున్నా మల్టీఫ్లేక్స్ బుకింగ్స్ బాగున్నాయనే టాక్ వినబడుతుంది. ఇక కలెక్షన్స్ కొల్లగొడుతున్నప్పటికీ తెలుగు ప్రేక్షకులు స్పైడర్ మీద చూపిస్తున్న ఫీలింగ్ కే మహేష్ ఫీలవుతున్నాడట.

అందుకే ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాకి మహేష్ బ్రేక్ తీసుకుంటున్నాడట. మనసు బాగోలేక భరత్ అనే నేను సినిమా షూటింగ్ లో మహేష్ పాల్గొనలేకపోతున్నాడనే గుసగుసలు వినబడుతున్నాయి. ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు సెకండ్ షెడ్యూల్ మొదలెట్టుకోవాల్సి ఉందట. మరి మహేష్ వలన ప్రస్తుతానికి సినిమాకి బ్రేక్ పడేలా ఉందంటున్నారు.

Similar News