స్పైడర్ తర్వాత మురుగదాస్ ఆ హీరోతోనే చేస్తాడా..?

Update: 2017-07-15 11:00 GMT

మురుగదాస్ ప్రస్తుతం మహేష్ తో 'స్పైడర్' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ ఈనెలాఖరుతో పూర్తవుతుంది. ఇక పోస్ట్ ప్రొడక్షన్ పనులు ముగించుకుని వచ్చే దసరాకి స్పైడర్ ని విడుదల చేసేందుకు సన్నద్ధం అవుతున్నాడు మురుగదాస్. ఇక మురుగదాస్ 'స్పైడర్' చిత్రం తర్వాత చెయ్యబోయే చిత్రంపై అప్పుడే ఊహాగానాలు మొదలయ్యాయి.

తమిళంలో విజయ్ తో 'కత్తి, తుపాకీ' చిత్రాలను తెరకెక్కించిన మురుగదాస్ ఆ చిత్రాలతో సూపర్ హిట్ అందుకున్నాడు. మరోసారి ఈ హిట్ కాంబినేషన్ రిపీట్ కాబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. మరి రెండుసార్లు హిట్ కొట్టిన ఈ కాంబినేషన్లో మరో సినిమా న్యూస్ బయటికి రాగానే అప్పుడే సినిమాపై అంచనాలు మొదలైపోయాయి. ఇంకా ఈ సినిమా గురించి ఎటువంటి ప్రకటన రాకముందే ఈ చిత్రంపై హైప్ క్రియేట్ అయ్యింది. రెండేళ్ల క్రితం ‘కత్తి’తో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ ఇచ్చిన హీరో విజయ్‌, దర్శకుడు మురుగదాస్‌, సంగీత దర్శకుడు అనిరుధ్‌ల కాంబినేషన్‌లో మరో చిత్రం రూపొందబోతుందంటూ కోలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.

మరి 'తుపాకీ, కత్తి' వంటి హిట్స్ తర్వాత రాబోతున్న చిత్రం హ్యాట్రిక్ కొడుతుందని విజయ్ అభిమానులు అప్పుడే సంబరాలు స్టార్ట్ చేశారంటున్నారు. అయితే విజయ్ తో మూడో ప్రాజెక్ట్ ని తెరకెక్కించేందుకు గాను మురుగదాస్ ఇప్పటికే స్క్రిప్ట్ ని కూడా సిద్ధం చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి.

Similar News