స్టార్ హీరోస్ సినిమాల రేంజ్ లోనే చిన్న హీరో సినిమా

Update: 2016-12-16 15:12 GMT

తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడు బెల్లంకొండ శ్రీనివాస్ కథానాయకుడిగా పరిచయం ఐన అల్లుడు శ్రీను ఒక కొత్త హీరో స్థాయికి మించి దాదాపు నాలుగు రేట్లు అదనంగా బడ్జెట్ వెచ్చించి నిర్మించారు బెల్లంకొండ శ్రీనివాస్. ఆ చిత్రం బడ్జెట్ పరిమితులు చిత్రీకరణ ప్రారంభానికి ముందే చేయగలిగిన మార్కెట్ ని ధృధతిలో పెట్టుకుని వుంది ఉంటే సక్సెస్ఫుల్ సినిమానే ఐయి ఉండేది అని ట్రేడ్ అనలిస్టులు అభిప్రాయపడిన విషయం విదితమే. ఆ చిత్రం మిగిల్చిన నష్టాలతో అల్లుడు శీను తరువాత బెల్లంకొండ శ్రీనివాస్ రెండవ చిత్రాన్ని ప్రకటించినా ఆ చిత్రాన్ని బడ్జెట్ సర్దుబాటు కాక నిలిపివేశారు.

బెల్లంకొండ శ్రీనివాస్ రెండవ చిత్రమే బోయపాటి శ్రీను చేయవలసి ఉండగా ఆ చిత్రం నిలిచిపోవటంతో బోయపాటి సరైనోడుతో, బెల్లంకొండ శ్రీనివాస్ స్పీడున్నోడు తో వేరు వేరుగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. స్పీడున్నోడు తమిళ రీమేక్ గా భీమినేని శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కగా ఆ చిత్రాన్ని ప్రేక్షకులు తిరస్కరించారు. దీనితో బెల్లంకొండ శ్రీనివాస్ పరిస్థితి ఇంకా ఘోరంగా మారింది. ఇక ఆ తరుణంలో మాస్ ప్రేక్షకులకు చేరువవటం ఒక్కటే మార్గం అనుకున్న బెల్లంకొండ తిరిగి బోయపాటి చిత్రాన్ని పట్టాలెక్కించారు. నందమూరి బాల కృష్ణ, అల్లు అర్జున్ వంటి స్టార్స్ తో సినిమాల తరువాత బోయపాటి ఈ చిత్రం ఎందుకు చేస్తున్నాడా అని అందరూ ఆశ్చర్య పోయారు. అయితే ఇది స్టార్ హీరో చిత్రానికి ఏ మాత్రం తీసిపోదు అని, స్టార్ హీరో తో చేసే మాస్ కమర్షియల్ సినిమాలో వుండే అంశాలు అన్ని ఈ చిత్రంలో ఉంటాయి అని బోయపాటి బృందం తెలుపుతుంది.

అల్లుడు శీను ని ఒక మాస్ డైరెక్టర్ వి.వి.వినాయక్ లావిష్ గా తెరకెక్కించగా ఆ చిత్రం మార్కెట్ అంచనాలను అందుకోలేకపోయింది. ఇప్పుడు మరో మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను బడ్జెట్ అదుపులో ఉంచక ఇలా భారీ యాక్షన్ సీక్వెన్సెస్ తో చిత్రాన్ని తెరకెక్కిస్తే ప్రస్తుత మార్కెట్ లో ఏ మాత్రం క్రేజ్ లేని బెల్లంకొండ శ్రీనివాస్ పెట్టిన పెట్టుబడిని ధాటి లాభాల బాట పట్టటం కష్టమే.

Similar News