స్టార్ హీరోయిన్ అన్న ఆత్మ విశ్వాసం వచ్చేసింది

Update: 2017-02-02 04:55 GMT

నేటి తరం తెలుగు చలన చిత్ర కథానాయికలలో ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ అగ్ర స్థానం లో వుంది. దాదాపు రకుల్ ప్రీత్ సింగ్, రాశి ఖన్నా ల కెరీర్ ఒకేసారి ప్రారంభం, ఐయ్యింది. ఊహలు గుసగుసలాడే చిత్రంతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన రాశి ఖన్నా అనతి కాలంలో నే స్టార్ హీరోయిన్ అయిపోతుంది అని అందరూ అనుకున్నారు. అయితే రాశి మాత్రం రేస్ లో రకుల్ ని అందుకోవడంలో చాలా వెనుకంజలో వుంది. ఇప్పటివరకు స్టార్ హీరోస్ ఐన మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, తారక్, రామ్ చరణ్ తేజ్ వంటి వారి చిత్రాలలో అవకాశాలు దక్కించుకోవటానికి అమ్మడు ప్రయత్నాలు చేయకపోవటం ఇందుకు ప్రధాన కారణం. కాగా రాశి ఖన్నా కుర్ర హీరోల తో చేసిన జోరు, హైపర్ వంటి చిత్రాలు మిశ్రమ ఫలితాలు ఇవ్వటంతో అమ్మడి కెరీర్ గ్రాఫ్ ఒక్కసారిగా పడిపోయింది. ప్రేక్షకులకు గ్లామర్ గా కనిపించే క్రమంలో బొద్దుగా వుండే రాశి కష్టపడి తగ్గి ఇప్పుడు కొత్త ప్రయత్నాలు చేస్తుంది.

"చిత్ర పరిశ్రమలో నేను సక్సెస్ ని కొనసాగించలేకపోవటానికి కారణమైన కొన్ని తప్పులను నేను గ్రహించాను. తొలి నుంచి స్టార్ హీరోస్ సినిమా లో చేసే అర్హత ఇంకా రాలేదేమో అని భ్రమ పడుతూ వరుసగా చిన్న హీరోల చిత్రాలలో చేస్తూ వచ్చాను. అయితే అటువంటి క్రేజీ ఆఫర్స్ వచ్చినప్పుడు స్టార్స్ సినిమా లు వదులుకోవటమే నేను చేసిన పెద్ద తప్పు. చిన్న హీరోల సినిమాలు ఆడకపోతే ఆ ఇంపాక్ట్ నా కెరీర్ పై కూడా పడుతుంది. అదే స్టార్ హీరో సినిమాలో కనిపిస్తే సినిమా ఫలితం ఎలా వున్నా ప్రేక్షకులలో గుర్తింపు పెరుగుతూ ఉంటుందని నేను చాలా ఆలస్యం గా గ్రహించాను. ఇక ఐప్పటి నుంచి నా కెరీర్ గ్రాఫ్ ని కన్సిస్టెంట్ గా మైంటైన్ చేయటానికి ప్రయత్నాలు చేస్తాను. అలా అని కేవలం స్టార్ హీరోస్ సరసన నటించటానికి పరిమితం కాకుండా అందరి హీరోల సినిమా లలో నటిస్తాను. ఇప్పటికే నేను సంపాదించుకున్న అనుభవం నాకు స్టార్ హీరోయిన్ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని అనిపించేలా ఆత్మా విశ్వాసాన్ని పెంచింది. ఇక పై నా ప్రతి సినిమాలో నా గ్లామర్ తో పాటు నా ఆత్మ విశ్వాసాన్ని కూడా ప్రేక్షకులు గ్రహించేలా నా నటన ఉంటుంది." అంటూ ధీమా వ్యక్తం చేస్తుంది ఫ్యూచర్ స్టార్ హీరోయిన్ రాశి ఖన్నా.

Similar News