స్టార్ హీరో సరసన మరో స్టార్ హీరో కూతురు

Update: 2016-12-14 06:40 GMT

సినిమా పరిశ్రమలో సెలబ్రిటీస్ వారసులు వృత్తి రీత్యా సినిమా పరిశ్రమనే ఎంచుకుని నటన, నిర్మాణం, దర్శకత్వం ఇలా పలు క్రాఫ్ట్స్ లో ఏదో ఒక క్రాఫ్ట్ కి లేదా మల్టీ టాలెంటెడ్ యంగ్ స్టార్స్ లా అనేక క్రాఫ్ట్స్ లో ప్రతిభ కనబరుస్తుంటారు. ఇందులో విశేషం ఏమి లేదు. కానీ ఒక స్టార్ హీరో సరసన మరో స్టార్ హీరో తనయ కథానాయిక గా ఆడి పాడితే మాత్రం అది సంచలన కలయికే అవుతుంది కదా! ఇప్పుడు బాలీవుడ్ లో ఇటువంటి అరుదైన సంచలనానికి రంగం సిద్ధం అవుతుంది. బాలీవుడ్ లో స్టార్ స్టేటస్ వున్న హ్రితిక్ రోషన్ తన రానున్న చిత్రాలలో ఒకదానికి సైఫ్ అలీ ఖాన్ పుత్రిక సారా అలీ ఖాన్ ను కథానాయికగా తీసుకోవటానికి మక్కువ చూపుతున్నట్టు విశ్వసనీయ సమాచారం.

ఇటీవలి కాలంలో కరణ్ జోహార్ తెరకెక్కించబోయే యూత్‌ఫుల్ ప్రేమ కథ ద్వారా సారా వెండితెర కు పరిచయం కాబోతున్నట్టు వార్తలు వచ్చినప్పటికీ, కరణ్ జోహార్ కి సారా తల్లి అమృత కి మధ్యన వున్న విభేదాలు సారా కి ఆ అవకాశాన్ని దూరం చేశాయి. ఆ ప్రాజెక్ట్ నుంచి సారా పేరు వైదొలిగిన కొద్ది రోజులకే హ్రితిక్ రోషన్ చిత్ర అవకాశం రావటం విశేషం. కరణ్ మల్హోత్రా దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఇప్పటికే సోషల్ మీడియాలో బాగా క్రేజ్ వున్న సారా అలీ ఖాన్ కి బాలీవుడ్ ఎటువంటి వెల్కమ్ తో సిద్ధం అవుతుందో త్వరలోనే చూడొచ్చు.

Similar News