స్టార్ డైరెక్టర్ అయితే ఏంటి నాకు కథ నచ్చాలి

Update: 2018-01-21 07:22 GMT

ఎవరన్నా స్టార్ హీరో అయినా... లేదా స్టార్ డైరెక్టర్ అయినా వున్నారంటే హీరోయిన్స్ ఏం ఆలోచించకుండా వెంటనే ఆ సబ్జెక్టును ఓకె చేసేస్తారు. కానీ సాయి పల్లవి మాత్రం స్టార్ హీరో అయితే ఏంటి.. స్టార్ డైరెక్టర్ అయితే ఏంటి తనకు కథ, పాత్ర నచ్చితేనే చేస్తా అంటుంది. దర్శకుడు లేదా హీరోపై అభిమానంతో అవకాశాన్ని వదులుకోకుంటే త్వరగా కనుమరుగు అయిపోవాల్సి వస్తుందని అంటోంది.

సదరు దర్శకుడు లేదా హీరోతో మళ్లీ చేసే అవకాశంఉంటది. కానీ ఒక్కసారి రాంగ్ స్టెప్ వేస్తె కథ విషయంలో మళ్లీ పైకి లేవలేమని చెబుతుంది ఈ ముద్దుగుమ్మ. దిల్‌ రాజు నిర్మాణంలో వరుసగా రెండు సినిమాలు చేసిన సాయి పల్లవి అతనితో మరో చిత్రానికి నో చెప్పింది. అందుకు పెద్ద కారణం ఏమి లేదంట.. స్టోరీ నచ్చకే ఆలా రిజెక్ట్ చేశా అని చెబుతుంది. అలానే మణిరత్నం అంటే పడి చచ్చిపోయే సాయి పల్లవి మణి చిత్రానికి కూడా నో చెప్పింది.

ఇలానే స్టార్ హీరో విక్రమ్ సరసన నటించే అవకాశాన్ని చేజేతులా వదులుకున్న సాయి పల్లవి అతని పక్కన బలమైన పాత్ర లేకపోతే తేలిపోతానని, దానికంటే అవకాశాన్ని వదులుకోవడమే మంచిదని చెప్పింది. మరి ఇలా వచ్చిన ఆఫర్ అల్లా రిజెక్ట్ చేసుకుంటూ పోతే ఇంకా సినిమాల్లో ఛాన్స్ వచ్చే అవకాశాలు ఉండవ్ అని..... అలా ఖాళీగా కూర్చోవటమే అని ఫిలిం నగర్ ప్రేక్షకులు చెబుతున్నారు.

Similar News