‘సోగ్గాడే చిన్నినాయనా’ అయిష్టంగానే…

నాగార్జున కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచినా ‘సోగ్గాడే చిన్నినాయనా’ లో నాగ్ సరసన నటించిన లావణ్య త్రిపాఠి కి కూడా తన కెరీర్ లో [more]

Update: 2020-05-01 10:52 GMT

నాగార్జున కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచినా ‘సోగ్గాడే చిన్నినాయనా’ లో నాగ్ సరసన నటించిన లావణ్య త్రిపాఠి కి కూడా తన కెరీర్ లో ఈమూవీ బిగ్గెస్ట్ హిట్ గా ఉంటుంది. అయితే అటువంటి సినిమాను లావణ్య అయిష్టంగానే ఒప్పుకుని చేయాల్సివచ్చిందని చెప్పింది. ఈసినిమా ఒప్పుకునప్పుడు చాలామంది నెగటివ్ గా మాట్లాడారు అని ఓ ఇంటర్వ్యూ లో చెప్పింది.అసలు ఈమూవీ ఎందుకు చేస్తున్నావ్…నాగార్జున లాంటి సీనియర్ హీరో తో చేస్తే ఓ ముద్ర పడిపోతుందని.. తర్వాత వరుసగా అలాంటి సినిమాలే వస్తాయని అన్నారట. దాంతో ఏం చేయాలో తెలియక తాను అయిష్టంగానే ఈ సినిమాకు సంతకం చేసినట్లు లావణ్య తెలిపింది.

అయితే ఇదే విషయాన్ని నాగార్జున కి కూడా చెప్పినట్టు… ఆయన చాలా తేలికగా దాన్ని తీసేసినట్టు…పైగా తనకు ఎన్నో మంచి విషయాలు చెప్పారని, తన కెరీర్ విషయంలో చక్కటి గైడెన్స్ ఇచ్చారని…ఇప్పటికి కూడా ఏమన్నా సలహాలు సూచనలు కావాలంటే ఆయను అడుగుతాని చెప్పింది.

ఇక రామ్ తో నటించిన ‘ఉన్నది ఒకటే జిందగీ’ సినిమాలో తన మేకప్ ఏమాత్రం బాగా లేదన్న విమర్శలు చాలా విన్నానని, దానికి తాను కూడా ఒప్పుకుంటానని..ఇప్పుడు పాత్రలు సెలక్షన్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నట్టు చెప్పింది. ఇక నేను ప్రస్తుతం ‘ఎ1 ఎక్స్‌ప్రెస్ సినిమాలో హాకీ క్రీడాకారిణిగా చాలా మంచి పాత్ర చేస్తున్నానని.. దీంతో పాటు తమిళంలో రెండు సినిమాలు చేస్తున్నానని చెప్పింది.

Tags:    

Similar News