సెట్స్ లో ఆమెని చూసి అభిమాని అయిపోయాడట

Update: 2017-01-31 21:30 GMT

తెలుగు తమిళ భాషలలో తిరుగు లేని క్రేజ్ వున్నా కథానాయిక అనుష్క శెట్టి బాహుబలి ది బిగినింగ్ లో డిగ్లామరైజ్డ్ రోల్ లో కనిపించినప్పటికీ యావత్ భారత దేశంలో సినిమా అభిమానులని తన ఎక్స్ప్రెషన్స్ తో ఆకట్టుకుంది. ప్రస్తుతం బాహుబలి-2 డబ్బింగ్ కార్యక్రమాలలో పాల్గొంటున్న అనుష్క భాగమతి అనే చిత్రంలో నటిస్తుంది కూడా. సైజు జీరో, రుద్రమదేవి, బాహుబలి వంటి చిత్రాలలో వరుసగా పెర్ఫార్మన్స్ ఓరియెంటెడ్ పాత్రలు పోషిస్తూ వచ్చిన అనుష్క తమిళంలో హరి దర్శకత్వంలో సూర్య హీరోగా వస్తున్న సింగం సిరీస్ ఎస్-3 లో గ్లామర్ రోల్ పోషించింది. ఈ చిత్రం ఫిబ్రవరి 9 న విడుదల కానుంది. ఇన్ని వైవిధ్యమైన పాత్రలని పోషిస్తున్న అనుష్క కి ప్రేక్షకులతో పాటు పరిశ్రమ వర్గాలలోనూ అభిమానుల సంఖ్యా పెరిగిపోతుంది.

అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తున్న భాగమతి చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న మలయాళ హీరో ఉన్ని ముకుందన్(జనతా గ్యారేజ్ ఫేమ్) సెట్స్ లో కెమెరా ముందు అనుష్క కనపరుస్తున్న అభినయానికి దాసోహం అయిపోయాడు. అనుష్క స్పాంటేనియస్ యాక్టింగ్ స్కిల్స్ ని తెగ పొగిడేస్తున్నాడు ఈ మళయాళ హీరో. "సామాజిక ప్రయోజనాల కోసం పాటుపడే యువకుడి పాత్రలో నేను నటిస్తున్నాను. అనుష్క ఒక గొప్ప నటి అని తెలుసు కానీ ఆవిడ యాక్టింగ్ ని లైవ్ లో చూస్తూ ఆవిడకి వీరాభిమానిని ఐపోయాను. అశోక్(పిల్ల జమిందార్ ఫేమ్) దర్శకత్వంలో భాగమతి చిత్రంలో భాగం అవటం నా అదృష్టం. జనతా గ్యారేజ్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నేను ఈ చిత్రం తో వారికి బాగా చేరువ అవుతానని నమ్మకం నాకు వుంది. అనుష్క షో స్టీలర్ గా నిలవటం ఖాయం కానీ ఆవిడ స్క్రీన్ ప్రెజన్స్ తో పాటు నేను కనిపించే ఫ్రేమ్స్ లో నా ఉనికిని కాపాడుకోవటానికి బాగా కష్టపడాల్సి వస్తుంది." అంటూ అనుష్క ని ఆకాశానికి ఎత్తేసాడు ఉన్ని ముకుందన్.

Similar News