సూర్య కి క్షమాపణ చెప్తున్నారా లేక వేలెత్తి చూపుతున్నారా?

Update: 2017-01-30 21:30 GMT

తమిళనాడు రాష్ట్రంలో జల్లికట్టు నిర్వహణకు వ్యతిరేకముగా సుప్రీమ్ న్యాయస్థానం తీర్పు వెల్లడించిన నాటి నుంచి సామాన్య ప్రజలతో పాటు సెలబ్రిటీస్ మరియు ప్రఖ్యాత మానవ హక్కుల సంఘాలు, మూగ జీవుల సంరక్షణ సంఘాలు వారి అభిప్రాయలు వ్యక్తపరిచే క్రమంలో హద్దులు ధాటి ప్రవర్తించిన సంఘటనలు మనం చూసాం. ఈ క్రమంలో పెటా సంఘం నటుడు సూర్య పై పలు ఆసక్తికర విమర్శలు చేయటంతో చర్చ వేడెక్కింది. సూర్య తమిళుల మనోభావాలు దెబ్బతీయొద్దు అంటూ జల్లికట్టు కి మద్దతు పలుకుతూ తమిళుల భావోద్వేగాలు కాపాడటానికి తమిళ సంస్కృతి సాంప్రదాయాన్ని విస్మరించే నిర్ణయాన్ని స్వీకరించబోమని పెద్ద పెద్ద మాటలు మాట్లాడింది తమిళ ప్రజల పై ప్రేమ తోనో తమిళ ప్రజలు పాటించే ఆనవాయితీలపై మక్కువతోనో కాదని, సూర్య కేవలం తన రాబోయే సింగం చిత్రం జనాల్లోకి తీసుకువెళ్ళటానికి జల్లికట్టు నిర్వహణకు సమర్ధిస్తూ వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించింది. ఈ ఆరోపణలకు తనకి వ్యక్తిగత నష్టంతో పాటు తన ప్రతిష్టకి భంగం కలిగింది అంటూ పెటా సంఘానికి కోర్ట్ ద్వారా నోటీసులు జారీ చేశారు సూర్య.

సూర్య పంపిన కోర్ట్ నోటీసులకు సమాధానం ఇస్తూ తమ ఆరోపణలు భాధ కలిగించి ఉంటే తమ క్షమాపణ స్వీకరించమని కోరుతూనే అగరం ఫౌండేషన్ ద్వారా చిన్నారుల సంరక్షణకు పాటుపడే మీరు మూగ జీవుల హింసను ఖండిస్తారని ఆశించామని మరో సారి తమ సమాధాన పత్రంలో జోడించి పంపారు. ఇదే లేఖ లో దిండిగల్ లో జల్లికట్టు క్రీడా నిర్వహణలో 14 సంవత్సరాల పసి వాడు మరణించిన విషయాన్ని గుర్తు చేస్తూ మీరు ఇటువంటి పసి వాళ్ళ మరణాలకు కారణమైన క్రూరమైన క్రీడని వ్యతిరేకిస్తారని మేము నమ్మాము అంటూ సూర్య తీరుని ఎండగడుతూ రాసిన ఈ లేఖ ని వివాదాస్పదం చేయటం ఇష్టం లేక ముందుగా క్షమాపణ తెలియజేసి తరువాత పెటా వారు వారి పని కానించారు. పెటా వారు సూర్య కి పంపిన ఈ లేఖ ఇప్పుడు తమిళ నాట మరింత చర్చనీయాంశం ఐయింది.

Similar News