సూపర్‌స్టార్ ఓకే అనేవరకు వెయిట్ చేయగలరా?

Update: 2016-11-15 09:36 GMT

బాలకృష్ణ 100 వ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి 2017 సంక్రాంతికి రిలీజ్ అవ్వడానికి సిద్ధమైపోతుంది. ఇక క్రిష్, బాలకృష్ణ ఈ సినిమా షూటింగ్ లో తీరికలేకుండా కష్టపడుతున్నారు. ఈ సినిమా ఆడియోని కూడా వచ్చేనెలలో జరపడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక గ్రాఫిక్ వర్క్ కూడా స్పీడందుకుంది. అయితే తన 100 వ చిత్రం షూటింగ్ సమయంలోనే బాలకృష్ణ తన 101 వ చిత్రాన్ని కూడా చెయ్యాలని కృష్ణ వంశీ తో రైతు చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కృష్ణ వంశీ కూడా ఒకపక్క నక్షత్రం సినిమా చేస్తూనే మరో పక్క బాలకృష్ణ రైతు చిత్రానికి సంబందించిన వర్క్ స్టార్ట్ చేసేసాడు.

దానిలో భాగం గానే కృష్ణ వంశీ బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబచ్చన్ ని రైతు సినిమాలో నటించమని అడగడానికి బాలకృష్ణ తో కలిసి ముంబై వెళ్లిన విషయం తెలిసిందే. అక్కడ అమితాబ్ తో భేటీ అయిన కృష్ణ వంశీ, బాలకృష్ణ అమితాబ్ ని రైతు లో ఒక కీలక పాత్రకి ఒప్పించారని ఆ మధ్యన వార్తలొచ్చాయి. అయితే ఇప్పుడు అమితాబచ్చన్ రైతు చిత్రం లో చెయ్యడానికి సుకుఖం గా లేరని చెబుతున్నారు. ఆయనకు వేరే కమిట్మెంట్స్ వల్ల కుదరదని చెప్పినట్లు ఒక వార్త ప్రచారంలోకి వచ్చింది. ఇంకా తాను రైతు సినిమాలో నటించాలంటే నా కమిట్మెంట్స్ అన్ని ముగియడానికి చాల టైం పడుతుందని..... అందుకే వచ్చే జూన్ వరకు ఆగితే డేట్స్ కేటాయించగలనని చెప్పారట. మరి దాదాపు 6 నెలలు సినిమాని మొదలు పెట్టకుండా పోస్ట్ పోన్ చెయ్యడానికి బాలకృష్ణ ఒప్పుకుంటాడా? లేక అమితాబ్ తోచెయ్యడానికి ఓపికపడతాడా? చూద్దాం ఏం జరుగుతుందో.

Similar News