సూపర్ స్టార్ సినిమాకు శాటిలైట్ రేట్ కష్టాలు

Update: 2016-12-04 06:54 GMT

సూపర్ స్టార్ మహేష్ బాబుకి తెలుగు రాష్ట్రాల్లో ఎంతటి క్రేజ్ ఉందొ ఓవర్సీస్ లోనూ అంతే క్రేజ్ వుంది. ఏపీ, నైజాం లలో భారీ వసూళ్లు రాబట్టలేని 1 నేనొక్కడినే, ఆగడు చిత్రాలు ఓవర్సీస్ బాక్సాఫీస్ పై ప్రభావం చూపటం ఇందుకు నిదర్శనం. తెలుగు చలన చిత్ర చరిత్రలోనూ మహేష్ బాబు నటించిన శ్రీమంతుడు వసూళ్ల పరంగా బాహుబలి అగ్ర స్థానంలో నిలవగా రెండవ స్థానం దక్కించుకుంది. మరి అంతటి సూపర్ స్టార్ సినిమాకి సెట్స్లో ఉండగానే థియేట్రికల్ రైట్స్, శాటిలైట్ రైట్స్ అమ్ముడుఅయిపోతుంటాయి. కానీ తెలుగు తమిళ భాషల్లో క్రేజీ ప్రాజెక్ట్ గా పరిగణిస్తున్న మహేష్ మురగ దాస్ ల చిత్రానికి ఇప్పటి వరకు బిజినెస్ జరగలేదు. ఇందుకు కారణం మహేష్ బాబు గత ఘోర పరాజయం బ్రహ్మోత్సవమే అని తెలుస్తుంది.

ఇప్పటికే మహేష్ మురగదాస్ ల చిత్రం శాటిలైట్ హక్కులు విక్రయించబడ్డాయి అని, తెలుగు తమిళ భాషల్లో 30 కోట్ల రూపాయల ఫాన్సీ రేట్ కి ఒక ప్రముఖ ఛానల్ ఆ హక్కులను దక్కించుకున్నాయి అని వచ్చిన కథనాలు అన్ని వాస్తవ దూరం అని నిరూపితమైనది. ఇప్పుడు నిర్మాతలు పలు ఛానెళ్ల యాజమాన్యాలకు శాటిలైట్ హక్కుల ప్రతిపాదనలు పంపుతుండగా వారిలో కొందరు ఇప్పటికే తిరస్కరించినట్టు సమాచారం. మరి కొందరు సంప్రదింపులకు ఒప్పుకున్నారు. ఇటీవలి కాలంలో అతి తక్కువ టీ.ఆర్.పీ రేటింగ్స్ తో ప్రసారమైన సూపర్ స్టార్ చిత్రం గా బ్రహ్మోత్సవం సగటు ఛానల్ వారిని విస్మయానికి గురు చేసింది. దానితో మహేష్ సినిమాల వ్యాపారంపై తీవ్ర ప్రభావమే చూపుతుంది.

అయితే ప్రపంచ వ్యాప్తంగా తెలుగు తమిళ సినీ ప్రేక్షకులకు తొలి నుంచి మురగదాస్ ప్రాజెక్ట్ పై నమ్మకం ఉండటంతో ఈ పరిస్థితి థియేట్రికల్ రైట్స్ వ్యాపారానికి ఎదురు కాబోదు అని నిర్మాతలు ఆశాభావంతో వున్నారు.

Similar News