సూపర్ స్టార్ కూడా పీవీపీ ని దిక్కరించాడే

Update: 2017-01-02 15:32 GMT

సూపర్ స్టార్ మహేష్ బాబు గత ఏడాది పీవీపీ సినిమాస్ కి చేసిన బ్రహ్మోత్సవం చిత్రం డిసాస్టర్ గా మిగలడంతో ఆ ఆర్ధిక నష్టాలు తీర్చటానికి పీవీపీ సినిమాస్ కి మరో సినిమా చేయటానికి ఒప్పుకున్న సంగతి విదితమే. అయితే పీవీపీ మహేష్ బాబు కోసం తనతో ఊపిరి అనంతరం మరో చిత్రానికి ఒప్పందం కుదుర్చుకున్న వంశి పైడిపల్లి కి కథ, దర్శకత్వ బాధ్యతలు అప్పగించగా ఆ కథను సిద్ధం చేసే వరకు పీవీపీ సినిమాస్ ఆఫీస్ లో వున్న వంశి అమాంతం ఆ కథను పట్టుకెళ్లి వైజయంతి మూవీస్ మరియు దిల్ రాజు ల కాంపౌండ్ లో తిష్ట వేసాడు. దీనితో నిర్మాత పీవీపీ మద్రాస్ న్యాయస్థానం ని ఆశ్రయించి ఆ కథ ఇతర నిర్మాణ సంస్థలు వినియోగించుకునే వెసులుబాటు లేని విధంగా స్టే తెచ్చుకున్నాడు. అయితే మద్రాస్ న్యాయస్థానం, హైద్రాబాద్ లో నిర్మాతల మండలి, ఫిలిం ఛాంబర్ లలో పీవీపీ నమోదు చేసిన ఫిర్యాదులపై సమాధానమిస్తూ ఎవరి పేర్లు ప్రస్తావించకుండా, పరోక్షంగా తన భవిష్యత్ కార్యాచరణ ట్విట్టర్ లో వెల్లడించాడు సూపర్ స్టార్ మహేష్ బాబు.

"ప్రస్తుతం నా 23 వ సినిమా ఏ.ఆర్ మురగదాస్ దర్శకత్వంలో చిత్రీకరణ జరుగుతుంది. 24 వ సినిమా కొరటాల శివ దర్శకత్వంలో డి.వి.వి.దానయ్య కు, 25 వ సినిమా ని వంశి పైడిపల్లి దర్శకత్వంలో వైజయంతి మూవీస్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంయుక్త నిర్మాణంలో, 26 వ సినిమా ని త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మైత్రి మూవీస్ కి చేయబోతున్నాను." అంటూ ఎప్పుడూ లేని విధంగా తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ పై ట్వీట్ చేసి స్పష్టత ఇచ్చాడు మహేష్ బాబు. ఆయన వెల్లడించిన జాబితా ప్రకారం రానున్న మూడు చిత్రాల వరకు పీవీపీ సినిమాస్ కి మహేష్ కాల్ షీట్స్ లేవు. మరి 27 వ చిత్రాన్ని ఏమైనా పీవీపీ నిర్మాణంలో చేస్తాడేమో తెలీదు. మహేష్ కూడా వంశి పైడిపల్లి తయారు చేసిన కథను అశ్విని దత్, దిల్ రాజు లైక్ చేస్తునట్టు ప్రకటించటంతో మరి పీవీపీ తాను లీగల్ గా ఈ వివాదాన్ని కొనసాగిస్తాడా లేక తాను చేసిన ఫిర్యాదులను ఉపసంహరించుకుంటాడా అనేది చూడాలి. మొత్తానికి అయితే దర్శకుడు వంశి పైడిపల్లి సేఫ్ అని అర్ధం అయిపోయింది.

Similar News