సుకుమార్ ను కలుద్దాం అన్న మహేష్

Update: 2018-04-01 11:57 GMT

రంగస్థలం సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న సుకుమార్ కు మహేష్ బాబు నుండి కబురు వచ్చింది. 1 నేనొక్కడినే డిజాస్టర్ తీసిన సుకుమార్ అంటే మహేష్ ఫ్యాన్స్ కు విపరీతమైన గౌరవం. ఎందుకంటె ఆ సినిమా కమర్షియల్ గా సక్సెస్ కాకపోయినా క్రిటిక్స్ తో సైతం మహేష్ అటెంప్ట్ గురించి యాక్టింగ్ గురించి ప్రశంశలు దక్కేలా చేసింది తనే కాబట్టి. అందుకే మహేష్ కు సుకుమార్ అంటే ఇష్టం.

అసలు మ్యాటర్ లోకి వెళ్తే.. మహేష్ రంగస్థలం సినిమాను ఇంకా చూడకపోయినా సుకుమార్ టేకింగ్ గురించి... చరణ్ యాక్టింగ్ గురించి రెగ్యులర్ అప్ డేట్స్ అందుకుంటున్నాడు. మహేష్...సుకుమార్ కు భరత్ అనే నేను షూటింగ్ అయిపోయాక ఒకసారి కలుద్దాం అని మెసేజ్ చేసాడంట. మరి అందులో భాగంగా తన కోసం ఏదైనా కథను సిద్ధం చేయమని చెబుతాడా లేదా ఫ్యూచర్ లో ఏమైనా సినిమా చేద్దాం అని మాట ఇస్తాడేమో చూడాలి.

ఏదిఏమైనా 1 నేనొక్కడినే ప్లాప్ అయినా సుకుమార్ - మహేష్ కాంబినేషన్ అంటే మహేష్ ఫ్యాన్స్ కె కాకుండా సాధారణ ప్రేక్షకులకి కూడా ఇష్టమే. ఈ కాంబినేషన్ రిపీట్ అయితే అంత కన్నా కావాల్సింది ఏముంది. ఇదే జరిగితే ఈసారి హిట్ కంఫర్మ్ అని భావిస్తున్నారు మహేష్ ఫ్యాన్స్.

Similar News