సీనియర్ హీరో కి హీరోయిన్స్ దొరకటం లేదు

Update: 2018-01-31 18:00 GMT

సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ వారి సొంత నిర్మాణ సంస్థలో దర్శకుడు తేజ తో ఒక చిత్రం చేయబోతున్నట్టు అందరికి తెలిసిందే. తన ప్రతి ప్రయత్నంలో కొత్త ఆర్టిస్ట్ లకి, టెక్నిషియన్స్ కి అవకాశం కలిపించే తేజ ఈ సారి కూడా మూడు రోజుల పాటు రామానాయుడు స్టూడియోస్ లో జరిగిన కాస్టింగ్ కాల్ లో ప్రత్యేక ఆడిషన్స్ నిర్వహించి తన కథలోని కొన్ని కీలక పాత్రలకు నూతన నటీనటుల్ని ఎంపిక చేసుకున్నారు.

హీరోయిన్ విషయంలో మాత్రం....

అయితే ప్రధాన కథానాయిక విషయం మాత్రం తేజ కి పెద్ద సమస్య గా మారింది. షూటింగ్ షెడ్యూల్ డేట్ దగ్గర పడుతుంది కానీ వెంకీ సరసన నటించబోయే హీరోయిన్ విషయంలో మాత్రం ఎలాంటి క్లారిటీ రాలేదు. ఇద్దరు పిల్లల తల్లి గా కనిపించే పాత్ర కావటంతో సీనియర్ హీరోయిన్స్ లలోనే ఒకరిని ఎంపిక చేసుకోవాలనుకుంటున్న తేజకి మరో ప్రధాన సమస్య ఈ చిత్రంలో వున్న రెండు డ్యూయెట్స్. సీనియర్ హీరోయిన్స్ అయి ఉండాలి పైగా హీరోతో డ్యూయెట్స్ తో ప్రేక్షకులని మెప్పించగలగాలి కాబట్టి ఈ పాత్రకి ఏ హీరోయిన్ అయితే సెట్ అవుతుందో ఒక పట్టాన తేల్చుకోలేకపోతున్నారు హీరో వెంకటేష్ మరియు డైరెక్టర్ తేజ.

Similar News