సినిమా వాళ్లు వెరైటీగా స్పందిస్తున్నారు

Update: 2016-11-10 05:34 GMT

పెద్ద నోట్ల రద్దు అని మోడీ చేసిన ప్రకటనతో చాలామంది ఆనందం గా ఉంటే, మరికొంతమంది ఎవరికీ తెలియకుండా బాధపడిపోతున్నారు. ఇక ఈ ప్రభావం అందరి(సామాన్య మానవుడు, ధనికులు) పై పడింది. ఇక సినిమా పరిశ్రమ పై ఈ ప్రభావం ఇంకాస్త ఎక్కువగా వుంది. ఈ పరిశ్రమలో బ్లాక్ మనీ హవా నడుస్తున్న పరిశ్రమ. ఇక మోడీ ప్రకటనపై సినిమా హీరోల దగ్గరనుండి దర్శకుల దగ్గరనుండి అందరూ తమ తమ అభిప్రాయాలు సోషల్ మీడియాలో తెలుపుతున్నారు. కొంతమంది మోడీ కి శాల్యూట్ చేస్తుంటే ఇంకొంతమంది వెరైటీగా తమ స్పందన తెలియజేస్తున్నారు.

డైరెక్టర్ హరీష్ శంకర్ అయితే సినిమాటిక్ స్టైల్ లో 'మోడీ తరహా పాలనలో భారత్ లో ఇంటర్వెల్ బ్యాంగ్ అద్భుతంగా అదిరిపోయేలా ఉందని 'స్పందించాడు. ఇక హీరో నాని అయితే మరికాస్త భిన్నం గా ఆలోచించాడు. తన స్టైల్లో మోదీగారిని ప్రశంసిస్తూ '1947లో గాంధీగారు కొబ్బరికాయ కొట్టారు 2016లో మోడీ గుమ్మడికాయ కొట్టారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే ఇండియా విడుదల' అని సోషల్ మీడియా లో పోస్ట్ చేసాడు. ఇక సినిమా వాళ్ళు, మిగతా వాళ్ళ ఎలా స్పందిస్తారా అని నెటిజెన్ల ఇప్పటికే చాలా ఆశక్తిగా తిలకిస్తున్నారు.

Similar News