సినిమా నచ్చితే చుడండి లేకపోతే లేదు అన్న పవర్ స్టార్

Update: 2017-04-01 14:13 GMT

సంచలనాత్మక దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన కెరీర్ లో హిట్స్ అన్ని అనుకోకుండా వచ్చినవి అని, ఫ్లోప్స్ అన్ని ఆయన శ్రమకి ఫలితంగా వచ్చినవి అని చెప్తూ ప్రతి సారి సినిమా నచ్చితే చుడండి లేకపోతే లేదు అని నిర్మొహమాటంగా చెప్పేస్తుంటారు. అయితే ఆయన సినిమాలు భారీ రేట్స్ కి పంపిణీదారులు కొనుక్కోవటం అంటూ ఉండదు కాబట్టి బడ్జెట్ లోపే ఆయన సినిమాలు వుంటుంటాయి కాబట్టి వర్మ ఈ వ్యాఖ్యలు చేసినా పెద్దగా నష్టపోయే వారెవరు ఉండకపోవచ్చు. కానీ ఇలాంటి ధోరణిని పాతిక కోట్ల రూపాయల పారితోషికం తీసుకుని, దాదాపు 70 కోట్ల రూపాయల వ్యయంతో సినిమా నిర్మించి ఆ చిత్రాన్ని 80 నుంచి 85 కోట్ల రూపాయలకి విక్రయించిన తరువాత ఆ సినిమాలో నటించిన ఓ స్టార్ హీరో ఇలాంటి ధోరణి అవలంబిస్తే మరి సినిమా కొనుక్కున్న పంపిణీదారులు పరిస్థితి ఏమిటి? ఇప్పుడు కాటమరాయుడు కొన్న పంపిణీదారులకి ఇలాంటి భయాందోళన పరిస్థితే ఎదురయ్యింది పాపం.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన సినిమాల విడుదలకి ముందు కానీ విడుదల అనంతరం కానీ ప్రెస్ వారితో ముచ్చటించటం తాను చేసిన సినిమా విశేషాలు పంచుకోవటం వంటివి చెయ్యడు. అందుకే మీడియా వారికి పవన్ కళ్యాణ్ అగ్రి గోల్డ్ భాధితులని పరామర్శించటానికి విజయవాడ నగరానికి విచేసినప్పుడు ఆయన తాజా చిత్రం కాటమరాయుడు ఫలితం గురించి స్పందించమని సందర్భం కాకపోయినా అడిగారు. దీనికి స్పందించిన పవన్ కళ్యాణ్, "ప్రజా సమస్యల్ని ప్రస్తావించటానికి కూడా సినిమా అనే మాంద్యమం ఉపయోగపడుతుంది. చైతన్య పరచటానికి వీలు అవుతుంది. అందుకే నాకు సినిమా అంటే చాలా గౌరవం. అయితే నా సినిమా నచ్చితే చుడండి లేకపోతే చూడొద్దు. ఆ ఫలితాలపై నాకు పెద్దగా పట్టింపులు వుండవు." అంటూ బదులిచ్చి ఆశర్య పరిచాడు పవన్ కళ్యాణ్. పవర్ స్టార్ తాను విజయవాడ వచ్చిన పర్పస్ వేరు కావటంతో ప్రెస్ వారు ఈ సినిమా ప్రస్తావన తీసుకు వచ్చే సరికి ఇలా సంభాషించి ఉండొచ్చు అని మనం సరిపెట్టుకున్నా తొలి వారం ప్రదర్శనలు ముగిసిపోయే నాటికి కూడా కాటమరాయుడు పంపిణీదారులు సేఫ్ జోన్ దిశగా అడుగులు వేయలేక సతమతమవుతున్న సమయంలో పవర్ స్టార్ చేసిన ఈ వ్యాఖ్యలు వారిని మరింతగా కలచి వేయటం ఖాయం.

Similar News