సినిమా ఆడకపోయినా అలాంటి అవకాశం మరొకటి వచ్చింది

Update: 2017-05-09 12:27 GMT

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తెలుగు అమ్మాయిలకి కథానాయికగా అవకాశాలు దక్కటం చాలా కష్టమని తెలుగు వారంటే కథానాయికగా పనికి రారనే భావనతో గుర్తించారని ఆరోపణలు చాలానే ఎదుర్కొంటుంది మన చిత్ర పరిశ్రమ. ఇందుకు ఉదాహరణలు కూడా లేకపోలేదు. అలానే తెలుగు అమ్మాయి ఐన తేజస్వి మదివాడ కథానాయికగా ఎదగాలనే ఆశయంతో టాలీవుడ్ లోకి ప్రవేశించి ముందుగా హీరోయిన్ సిస్టర్, ఫ్రెండ్ రోల్స్ తో యాక్టింగ్ ప్రారంభించిన తేజస్వి మదివాడ కేరింత, రోజులు మారాయి చిత్రాలలో ఇద్దరు కథానాయికలలో ఒక కథానాయికగా నటించింది కానీ ఆ సినిమాల వల్ల తేజస్వి కెరీర్ కి లాభం చేకూరలేదు. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో ఐస్ క్రీం చిత్రంలో హాట్ లుక్స్ తో వర్మ కెమెరా ఫోకస్ చేసే ఫ్రేమింగ్స్ లో అందాలని ఆరబోస్తూ అలజడి సృష్టించే ప్రయత్నం చేసినా తేజస్వి కి ఆ తరహా ఇమేజ్ కూడా రాలేదు.

చేస్తున్న ప్రతి ప్రయత్నం వృధాగా పోతుండటంతో బబ్లీ కారక్టర్స్ ఇమేజ్ నుంచి బైటకి రావటానికి ట్రై చేస్తున్న తేజస్వి మదివాడ కి అడల్ట్ ఫిలిం జోనర్ లో వచ్చిన అవకాశంతో సరికొత్త ఇమేజ్ పొందాలని ఆశపడి బాలీవుడ్ ప్రేక్షకుల మన్ననలు పొందిన హంటర్ రీమేక్ బాబు బాగా బిజీ చిత్రంలో ఒక కథానాయికగా నటించింది. అయితే ఈ చిత్రం ఆశించిన ఫలితం ఇవ్వకపోవటంతో తేజస్వి పెట్టుకున్న ఆశలు మళ్లీ చెదిరిపోయాయి. సినిమా ఫలితం బెడిసికొట్టడంతో అనుకున్న ఇమేజ్ ఏర్పడకపోయినప్పటికీ ఇప్పుడు మరో అడల్ట్ జోనర్ ఫిలిం లో కథానాయికగా నటించే అవకాశం తేజస్వి మదివాడ ని వరించింది. మరాఠి లో సూపర్ హిట్ ఐన అడల్ట్ కామెడీ చిత్రం 'బాలక పాలక్' కి తెలుగు రీమేక్ ని శ్రీకాంత్ వెలగలేటి అనే కొత్త దర్శకుడు తెలుగులో చేస్తున్నాడు. తేజస్వి మదివాడ ప్రధాన కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంతోనైనా తేజస్వి తెలుగు లో బిజీ అవుతుందేమో చూద్దాం.

Similar News