సామాజిక సందేశం ఈ సారి కూడా తప్పటం లేదట

Update: 2017-03-16 03:41 GMT

సందేశాత్మక చిత్రాల కంటే వాణిజ్య చిత్రాలకే గిరాకీ ఎక్కువ నడుస్తున్న రోజులివి. అయితే వాణిజ్య అంశాలతో చెప్తున్నా కథలో సామాజిక సందేశం జత కట్టి చెప్తే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఈ తరహాలోనే తమ సినిమా కథలు చెప్తున్నారు తమిళ ప్రముఖ దర్శకులు శంకర్ మరియు ఏ.ఆర్.మురగదాస్. మురగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన రమణ(ఠాగూర్), స్టాలిన్, తుపాకీ, కత్తి(ఖైదీ నెం.150 ) వంటి చిత్రాలన్నీ ఇందుకు నిదర్శనం. ఈ చిత్రాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి ఫలితాల్ని రాబట్టినవే. ఏ.ఆర్ మురగదాస్ ప్రస్తుతం తెరకెక్కిస్తున్న మహేష్ బాబు చిత్రం కూడా ఇదే కోవకి చెందుతుందని తెలుస్తోంది.

స్టార్ హీరో స్టేటస్ ఉన్నప్పటికీ కేవలం కమర్షియల్ కథలకి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వకుండా సోషల్ మెసేజ్ ని ప్రేక్షకులకు రీచ్ అయ్యే కమర్షియల్ ఎలెమెంట్స్ తో సినిమాలు చేసే దర్శకులకు మహేష్ బాబు డేట్స్ ఇవ్వటంలో ఎప్పుడూ ముందుంటాడు. గతంలో దర్శకుడు తేజ తెరకెక్కించిన నిజం చిత్రంతో లంచగొండి తనం పై తన తిరుగుబాటు ధోరణి చూపే యువకుడిగా నటించి ఎన్నో పురస్కారాలు పొందిన మహేష్ బాబు, ఇటీవలి కాలంలో కొరటాల శివ దర్శకత్వంలో శ్రీమంతుడు చిత్రంతో గ్రామాలను దత్తత తీసుకునే కాన్సెప్ట్ ని చాలా ఆహ్లాదకరంగా చెప్పి అటు కమర్షియల్ సక్సెస్తోపాటు ఇటు ప్రశంసలు కూడా అందుకున్నాడు. ఇప్పుడు వీరివురి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రానికి సంబంధించిన వివరాలు ఏవి బైటకి రాకుండా జాగ్రత్తలు వహిస్తునప్పటికీ ఇది సామాజిక అంశాలను స్పృశించే కమర్షియల్ కథ అని విశ్వసనీయ సమాచారం. ఈ చిత్రాన్ని జూన్ 23 న ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే విధంగా కృషి చేస్తున్నారు చిత్ర బృందం.

Similar News