సాటిలైట్ హక్కులని నిర్మాతకి వెనక్కి ఇచ్చేస్తామంటున్నారట

Update: 2017-04-05 14:20 GMT

సూపర్ స్టార్ మహేష్ బాబు-అడ్డాల శ్రీకాంత్ కాంబినేషన్ లో వచ్చిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఫామిలీ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకోవటమే కాక, అడ్డాల శ్రీకాంత కి దర్శకుడిగా ఇండస్ట్రీలో ఒక ఐడెంటిటీ ని క్రియేట్ చేసి, తెలుగులో అంతరించిపోతున్న ముల్టీస్టారర్ చిత్రాలకు తిరిగి క్రేజ్ తీసుకువచ్చింది. అటువంటి గొప్ప చిత్రం అనంతరం మహేష్ బాబు-అడ్డాల శ్రీకాంత్ కాంబినేషన్ మరొక సారి సెట్ కావటంతో బ్రహ్మోత్సవంతో పీవీపీ సినిమా కి భారీ విజయం ఖాయం అనే అనుకున్నారంతా. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు క్రేజ్ తోపాటు సత్యరాజ్, రావు రమేష్, రేవతి, జయ సుధా, శుభలేఖ సుధాకర్, తనికెళ్ళ భరణి, కాజల్ అగర్వాల్, సమంత, ప్రణీత సుభాష్ వంటి భారీ స్టార్ కాస్టింగ్ వున్న చిత్రం కావటంతో ఈ చిత్రానికి విడుదలకి ముందు ఏర్పడ్డ అంచనాల కారణంగా ఫాన్సీ రేట్స్ కి సినిమా అమ్ముడుపోయింది.

గత ఏడాది మే 20 న ప్రేక్షకుల ముందుకి వచ్చిన బ్రహ్మోత్సవం కథనం విడుదలైన తొలి ఆట నుంచే ప్రేక్షకుల అంచనాలని తయారు మారు చేసేసింది. దానితో ఈ చిత్ర వ్యాపారంలో భాగమైన నిర్మాత పీవీపీ నుంచి పంపిణీదారులు, కొనుగోలుదారులు, ప్రదర్శనదారులు వరకు అందరికి నష్టాలని మిగిల్చింది. చిత్రం విడుదలకి ముందుగానే మరో గొప్ప ఫామిలీ ఎంటర్టైనర్ అవుతుందనే అంచనాలతో జీ నెట్వర్క్ వారు బ్రహ్మోత్సవం చిత్ర సాటిలైట్ హక్కుల కోసం ఏకంగా పది కోట్ల రూపాయలు వెచ్చించి టెలికాస్ట్ హక్కులు దక్కించుకున్నారు. కాగా థియేటర్స్ లో ఫెయిల్ ఐన ఈ చిత్రం బుల్లి తెరపై కూడా డిసాస్టర్ గా మిగిలింది. సూపర్ స్టార్ చిత్రాలకు ఉండవలసిన నామమాత్రపు టీఆర్పీ రేటింగ్స్ కూడా బ్రహ్మోత్సవం చిత్రానికి దక్కటం లేదు. దీనితో నష్టపోతున్న జీ నెట్వర్క్ వారు తమ వద్ద వున్న బ్రహ్మోత్సవం టెలికాస్ట్ హక్కులని తిరిగి ఇచ్చేస్తామని ఎంతో కొంత సొమ్ము వెనక్కి ఇవ్వమని నిర్మాత పీవీపీ వద్దకు ప్రపోసల్ పంపారట. అయితే ఆ చిత్రంతో ఘోర నష్టాలను చవి చూసిన పీవీపీ ఇప్పుడు ఆ టెలికాస్ట్ హక్కులని తీసుకుంటే వేరొక టెలివిషన్ చానెల్స్ కి అమ్మటం కూడా కష్టమే. అందుకే పీవీపీ ఎటువంటి స్పందన చూపకుండా మౌనంగా ఉండిపోయినట్టు తెలుస్తుంది.

Similar News