సల్మాన్ ఖాన్ నామినేట్ కావటం అవమానంగా భావించి వాక్ అవుట్

Update: 2017-01-24 20:30 GMT

ఇప్పుడు హిందీ, తెలుగు, తమిళం, మలయాళం ఇలా భాష ఏదైనా కుర్ర కథానాయకుల దగ్గర నుంచి అగ్ర స్థాయి స్టార్ కథానాయకుల వరకు నటనతో పాటు ఇతర క్రాఫ్ట్స్ లో తమ ప్రావీణ్యం ప్రదర్శించటానికి తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే వీరు నటన తప్ప మిగతా విభాగాలలో ఎంత డెడికేషన్ తో పని చేస్తారన్నది ప్రశ్నార్ధకం. శింబు, ధనుష్ వంటి తమిళ హీరోలు ప్లే బ్యాక్ సింగెర్స్ గా కూడా సక్సెస్ కాగా, మంచు మనోజ్ తెలుగు లో ఫైట్స్ కూడా కంపోజ్ చేస్తూ అడపా దడపా అలరిస్తున్నారు. అలా హిందీ లో టాప్ హీరో ఐన సల్మాన్ ఖాన్ తాను నటించిన చిత్రం సుల్తాన్ లోని జగ్ గుమియా పాటలో కింద కూర్చుని గుండ్రంగా తిరిగే ఒక స్టెప్ ను స్వయంగా కంపోజ్ చేసాడు. ఈ స్టెప్ కేవలం సల్మాన్ ఖాన్ అభిమానులకి తప్పితే డాన్స్ ప్రేమికులకు అసలు రుచించదు. అయితే సుల్తాన్ సూపర్ సక్సెస్ సాధించటం తో ఇక ఈ స్టెప్పు కూడా సక్సెస్ అయినట్టే.

సల్మాన్ కంపోజ్ చేసి డాన్స్ చేసిన ఈ స్టెప్ కి ఫిలింఫేర్ అవార్డు లలో ఉత్తమ డాన్స్ కోరియోగ్రఫీ విభాగంలో నామినేట్ అయ్యే అర్హత లేదని అందరికీ తెలిసినప్పటికీ అక్కడ వున్నది సల్మాన్ ఖాన్ కాబట్టి నామినేట్ అవగ్గానే అందరూ చప్పట్లు కొడుతూ పెదాలపై బలవంతపు చిరు నవ్వు ప్రదర్శించారు. కానీ అదే అవార్డ్స్ వేడుకలో నుంచి ఈ పరిణామం నచ్చక బాలీవుడ్ కొరియోగ్రాఫర్ వైభవి మర్చంట్ లెచి బైటకి వెళ్లిపోయారు. బేఫికర్, ఓకే జాను వంటి యూత్ఫుల్ చిత్రాలలోని పాటలకు కొరియోగ్రఫీ చేసిన ప్రొఫెషనల్ కొరియోగ్రాఫర్ వైభవి మర్చంట్ సోషల్ మీడియా ద్వారా సలీమాన్ ఖాన్ ని ఉత్తమ కొరియోగ్రాఫర్ విభాగంలో నామినేట్ చేయటం పై ఫిలింఫేర్ ని తప్పుపట్టారు. ఈ పరిణామంతో ఫిలింఫేర్ కళ ని అవమానించిందంటూ మండిపడ్డారు. సోషల్ మీడియాలో వైభవి మర్చంట్ చేసిన వ్యాఖ్యలకు ఆవిడకు నెటిజన్ల నుంచి మద్దతు పెరుగుతుండటం గమనార్హం.

Similar News