సమంతపై మండిపడుతున్న నెటిజన్లు

Update: 2018-04-01 10:36 GMT

బాక్స్ ఆఫీస్ వద్ద రామ్ చరణ్ తన సత్తా చూపిస్తున్నాడు. రంగస్థలం సినిమా సూపర్ హిట్ అవ్వడంతో టీం కూడా తెగ ఆనందంగా ఉంది. సోషల్ మీడియాలో సినిమా హడావిడి మాములుగా లేదు. ఎవరు చూసినా ఈ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. రామ్ చరణ్ నటన గురించి...సమంత రోల్ గురించి అంత మాట్లాడుకుంటున్నారు. సుక్కూ టేకింగ్ గురించే చర్చ జరుగుతోంది.

సినిమాలో చిట్టి బాబుకి.. రామలక్ష్మీకి ఎంత ఇష్టమో చెప్పే ప్రపోజింగ్ సీన్ సినిమాలో వన్ ఆఫ్ ది హైలెట్ సీన్ ఇదే. ఈ సీన్ లో మొదట రామలక్ష్మీ.. చిట్టి బాబు పెదాలకు ముద్దు పెడుతుంది తర్వాత చిట్టి బాబు కూడా షాక్ కి గురై తిరిగి వెంటనే ముద్దు పెట్టె సీన్ సమంత ఏ మాత్రం సంకోచించకుండా చేసేసింది. కానీ చరణ్ మాత్రం కొంచం సిగ్గుతో చేతులను అడ్డుపెట్టుకున్నాడు.

దీంతో చాలా మందికి సమంత ఇలా చేయడం నచ్చట్లేదు. సమంత ఇప్పుడు మామూలు నటి కాదు. అక్కినేని వారి కోడలు కూడా. చైతుని ప్రేమించి పెళ్లి చేసుకుని మరో హీరోకి ఇలా లిప్ టు లిప్ ముద్దు పెట్టడం ఏమిటని? కొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మరోపక్క సమంత ఫ్యాన్స్, రామ్ చరణ్ కి కూడా పెళ్లి అయింది, మరి ముద్దు ఎలా పెట్టాడో అని కౌంటర్స్ వేస్తున్నారు.

Similar News