సమంత విషయంలో వేటికవే సాటి!

Update: 2018-03-25 06:15 GMT

చైతు తో పెళ్లి, అక్కినేని ఇంటి కోడలిగా హోదా.. ఇవేమి సమంత లైఫ్ ని మార్చలేదు. తన కెరీర్ పెళ్లికి ముందెలా ఉందొ.. పెళ్లి తర్వాత కూడా అలానే ఉంది. పెళ్ళికి ముందు సినిమాల్లో ఎంత జోరు చూపించిందో పెళ్లి తర్వాత కూడా అంతే జోరు చూపిస్తుంది సమంత అక్కినేని. అటు సినిమాల్లోనూ హాట్నెస్ ని ప్రదర్శిస్తూనే చైతు తో వెకేషన్స్ లో ఎంజాయ్ చేస్తున్న సమంత అప్పుడప్పుడు హాట్ హాట్ ఫొటోస్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అందరిని మత్తెక్కిస్తోంది. గృహిణిగా ఆలోచనల్లో మార్పు రావొచ్చేమోగాని.. వృత్తి పరంగా మాత్రం ఎటువంటి మార్పు లేదని చెబుతున్న సమంత చేనేత వస్త్రాలకు బ్రాండ్ అంసిడర్ గా తెలంగాణ స్టేట్ కి పనిచేస్తుంది.

ఇప్పుడు సమంత చేనేత డ్రెస్సులో ఒంటినిండా బట్టలు కప్పుకుని మత్తెక్కిస్తూ చూస్తున్న ఒక ఫోటో ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. మరి ఆ ఫొటోలో సమంత తన అందాలను కప్పేసి.. ఎవ్వరికి కనబడకుండా చేనేత డ్రెస్సుతో కవర్ చేసి మరి వయ్యారంగా నుంచుని అలా అలా చూస్తున్న సమంతని చూస్తుంటే ముద్దెచ్చేస్తుంది. కళ్ళతో కైపెక్కించే సమంత.. మీకు ఈ చేనేత వస్త్రాలు కావాలంటే క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నేతృత్వంలో ఏప్రిల్ 7 8 తేదీలలో చెన్నైలోని మై ఫార్చ్యూన్ హోటల్లో జరగబోతున్న చేనేత వస్త్రాల ఎగ్జిబిషన్లో దొరుకుతాయంటూ పోస్ట్ కూడా చేసింది.

మరి ఈ సుందరాంగి నటించిన రంగస్థలంలో రామలక్ష్మిలా లంగాఓణిలో డి గ్లామర్ పాత్రలో చూపులోని అమాయకత్వం, మేకప్ లేని అందం, మొహంలో హావభావాలతో అదరగొట్టేస్తుంది. మరి ఈ సుందరి డి గ్లామర్ పాత్ర వేసినా, చేనేత వస్త్రం కట్టినా.. బికినిలో అదరగొట్టినా వేటికవే సాటి అన్నట్లుగా ఉంటుంది.

Similar News