సమంత డ్యూయెల్ రోల్ కి గ్రాఫిక్స్ అవసరం లేదండీ

Update: 2017-02-08 20:30 GMT

తెలుగు, తమిళ భాషలలో బాగా క్రేజ్ వున్నా కథానాయికల్లో ఒకరైన సమంత రుతు ప్రభు ద్విపాత్రాభినయం చేయాల్సి వస్తే ఎక్కువ సమయం చిత్రీకరణలకి, కెమెరా గ్రాఫిక్స్ కి వాడవలసిన అవసరం ఉండదేమో అనిపించేలా ఆచం సమంతని పోలి వున్న ఒక అమ్మాయి ఇంస్టాగ్రామ్లో దర్శనమిచ్చింది. ఇంస్టాగ్రామ్లో సమంత ఫోటోలలో ఫోజులని ఇమిటేట్ చేస్తూ పలు ఫోటోలు పోస్ట్ చేస్తూ, సమంత సినిమా వీడియోలకు డబ్ స్మాషులు చేస్తూ ఇంస్టాగ్రామ్లో హల్చల్ చేస్తున్న ఈ అమ్మాయి పేరు ఆశు రెడ్డి. సమంత జన్మించింది మద్రాస్ కాగా, సమంత పోలికలతో వున్న ఆశు రెడ్డి తెలుగు అమ్మాయి కావటం విశేషం. ఇప్పటికే ఆశు రెడ్డికి ఇంస్టాగ్రామ్లో 40 వేళకి పైగా ఫాలోయర్స్ వున్నారంటే ఈ తెలుగు అమ్మాయి ఫాలోయింగ్ ఎటువంటిదో అర్ధం చేసుకోవచ్చు.

సినిమాల్లో తప్ప బైట నిజ జీవితంలో మనిషిని పోలిన మనుషులు ఉంటారంటే నమ్మటం సాధ్యపడే పని కాదు. కానీ ఆశు రెడ్డి పోస్ట్ చేస్తున్న సమంత గెస్టర్లలో వున్న ఫోటోలను చూస్తే నమ్మక తప్పదు. ఆశు రెడ్డి గ్లామర్ ఫీల్డ్ కి సంబంధించిన వ్యక్తి కాకపోవటంతో ఈ అమ్మాయి గురించిన వివరాలు ఎవరికీ తెలియదు. అందుకే ఆశు రెడ్డి సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేసే తన ఫోటోలు చూసిన వారంతా సమంత కి ట్విన్ సిస్టర్ అనే అనుకుని పొరపడుతున్నారు. అయితే ఇప్పుడు ఆశు రెడ్డి పోస్ట్ చేసిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. మరి ఈ ఫొటోలో తన పోలికలతో వున్న అమ్మాయిని చూసి సమంత ఎలా స్పందిస్తుందో చూడాలి.

Similar News