సమంత చేతికి ఏమైంది??

Update: 2018-01-31 08:23 GMT

అయ్యో సున్నితంగా వుండే సమంత చేతికి ఏమైంది? చేతికి ఆ కట్టేంటి? ప్రస్తుతం ఈ ప్రశ్నలు సోషల్ మీడియాలో తన ఫాన్స్ అడుగుతున్నారు. తాజాగా అలాంటి ట్వీట్ ఒక‌టి చేసి అంద‌రి క‌న్ను ఆమె మీద ప‌డేలా చేశారు. ఇంతకీ సమంత చేతికి కట్టు ఎందుకు వచ్చిందో ఆమె ఆన్సర్ చెప్పింది. మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తున్న‌ రాంచ‌ర‌ణ్ హీరోగా రంగస్థలం సినిమాలో ఫుల్ బిజీగా వున్న సామ్.. ఈ సినిమాలో కొన్ని కీల‌క‌మైన సీన్స్ ను రాజ‌మండ్రిలో షూట్ చేశారు. ఈ షెడ్యూల్ లో పాల్గొన్న స‌మంత‌కు హెవీ వ‌ర్క్ కార‌ణంగా చేతికి నొప్పి అనిపించింద‌ట‌. దింతో డాక్టర్స్ ని సంప్రదించగా క‌ట్టు కట్టుకోమన్నట్టు...ఇదే విష‌యాన్ని ఆమె ట్వీట్ లో చెప్పేశారు.

అందుకు నిదర్శనం...

ఫుల్ గా వర్క్ చేస్తున్నా అందుకు నిదర్శనం నా చేయ్యే అంటూ సామ్ ట్వీట్ చూస్తే.. నా క‌ళ్లు చెబుతున్నాయ్ అన్న సాంగ్ ను కాస్త మార్చి.. నా చేయి చెబుతోంది.. నేనెంత క‌ష్ట‌ప‌డ్డానో.... చూడ‌మ‌ని అంటూ పాట రూపంలో తన భావాన్ని తెలియజేసింది. ఏమైనా.. ప‌నిప‌ట్ల త‌న‌కున్న క‌మిట్ మెంట్ ను చెప్ప‌ట‌మే కాదు ఇలా చూపిస్తుంది సామ్.

Similar News