సమంత అలీతో జాలిగా ముచ్చట్లు..!

Update: 2018-09-18 08:56 GMT

ఈటివిలో అలీ యాంకరింగ్ లో అలీతో జాలిగా ప్రోగ్రాం 100 వ ఎపిసోడ్ స్పెషల్ గెస్ట్ గా సమంత హాజరైంది. ప్రతి సోమవారం ఒక సెలెబ్రిటీతో అలీ ఈ గేమ్ షో చేస్తున్నాడు. ఆ సెలెబ్రిటీ సినిమా ముచ్చట్ల దగ్గర నుండి.. వ్యక్తిగత విషయాల వరకు అలీతో పంచుకుని మరీ వెళతారు. అయితే 100 వ ఎపిసోడ్ స్పెషల్ గెస్ట్ గా వచ్చిన సమంత కూడా తన పర్సనల్ విషయాలతో పాటుగా సినిమా ముచ్చట్లు కూడా అలీతో షేర్ చేసుకుంది. తనకి డబ్బు అవసరం పడి చదువుతున్న రోజుల్లోనే మోడలింగ్ చేశానని.. విదేశాలకు వెళ్లి చదవాలనే తన కోరిక తీరకుండానే సినిమాల్లోకి వచ్చానని.. తెలుగులో ఏమాయ చేసావే సినిమా అప్పుడు చైతు తనకి ఫ్రెండ్ అయ్యాడని... ఆ సినిమా విషయంలో తెలుగు డైలాగ్స్ చెప్పేందుకు నేను పడుతున్న ఇబ్బంది చూసిన చైతు హెల్ప్ చేసాడని.. అప్పుడే తమకి ఫ్రెండ్షిప్ ఏర్పడిందని చెబుతుంది ఈ గ్లామర్ భామ.

ఇంట్లో చైతుదే డామినేష‌న్‌

ఇక చైతు తో ప్రేమ పెళ్లి ముచ్చట్లు చెప్పిన సమంత పెళ్లి తర్వాత కెరీర్ లో అద్భుతంగా దూసుకుపోతుంది. అయితే బయట సమంత చైతు మీద డామినేషన్ కనబడుతుంది. ఎందుకంటే చైతు కన్నా కెరీర్ లో సమంత ముందంజలో ఉంది. అంటే అప్పర్ హ్యాండ్ అన్నమాట. అయితే సమంత అలీతో జాలిగా ప్రోగ్రాంలో చైతుకి, తనకి మధ్య మంచి రిలేషన్ ఉందని... బయట తనది అప్పర్ హ్యాండ్ లా కనబడినా.. ఇంట్లో చైతూనే డామినేట్ చేస్తాడని. ఇంట్లో అన్ని విషయాల్లో చైతుదే అప్పర్ హ్యాండ్ అని బయట నేను వస పిట్టలా మాట్లాడితే.. ఇంట్లో కామ్ గా ఉంటానని.. ఇంట్లో మొత్తం చైతునే మాట్లాడతాడని చెబుతుంది. ఇంకా చైతుని తాను ప్రేమగా బేబీ అని పిలుచుకుంటానని చెబుతుంది.

బాధ్య‌త‌గా ఉంటున్నాను...

ఇక అక్కినేని ఇంటి కోడలయ్యాక తన బాధ్యత మరింత పెరిగిందని.. మాములు హీరోయిన్ సమంతగా నేను ఏమైనా చేయవచ్చు .. ఏదైనా మాట్లాడవచ్చు. కానీ అక్కినేని అనే ఇంటిపేరు వలన నేను ఎంతో బాధ్యతగా వుండవలసి ఉంటుంది... అంటూ తన బాధ్యతను గుర్తు చేసుకుంది. ఇక తన షార్ట్ టెంపర్ మొత్తం చైతన్య తగ్గించేసాడని... అందుకే తాను చాలా మారానని చెబుతుంది ఈ భామ. ఇక భర్తతో పోటీ ఎలా వుంది అంటే...ఆదేమి పోటీ కాదని రెండు సినిమాలు వేర్వేరు జోనర్స్ కాబట్టి మా మధ్య ఎలాంటి పోటీ లేదని చెప్పింది. ఇక యూ-టర్న్, శైలజ రెడ్డి అల్లుడు సినిమాలు అనుకుని ఒకేరోజు విడుదల చెయ్యలేదని.. అనుకోకుండా అలా జరిగిందని చెప్పుకొచ్చింది సామ్.

 

Similar News