సమ ప్రాధాన్యమున్న పాత్రలైతేనే ముల్టీస్టారర్స్ చేస్తాడట

Update: 2017-02-11 06:38 GMT

బాలీవుడ్ లో అగ్ర కథానాయకులు విరివిగా మల్టీ స్టారర్స్ చేస్తుంటే తెలుగులో మాత్రం ముల్టీస్టారర్స్ అప్ కింగ్ హీరోస్ కి మాత్రమే పరిమితమయ్యాయి. అడపా దడపా స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ మోస్ట్ కమెర్షియల్ల్లీ సక్సెస్ఫుల్ హీరోస్ ఐన మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ లతో కలిసి నటించారు. కాగా అక్కినేని నాగార్జున కృష్ణార్జున లో మంచు విష్ణు, మరియు ఊపిరి లో కార్తీ లతో కలిసి నటించినప్పటికీ వారు అనుభవ రీత్యా కానీ స్టార్ స్టేటస్ రీత్యా కానీ నాగార్జునకి సమూచికులు కారు. ఓం నమో వెంకటేశాయ వంటి చిత్రాలను కమెర్షియల్ మీటర్ నుంచి బైటకి వచ్చి ప్రయోగాలు చేస్తున్న మీరు చిరంజీవి, బాల కృష్ణ, వెంకటేష్ వంటి సీనియర్ హీరోస్ తో మల్టీ స్టారర్స్ ఎందుకు ప్రయత్నించటం లేదు అన్న ప్రశ్నకి ఆసక్తికర సామాధానం ఇచ్చారు.

"నేను మల్టీ స్టారర్స్ చేయటానికి ఎప్పుడూ సిద్దమే. పైగా కంఫర్ట్ జోన్ నుంచి బైటకి వచ్చి ప్రయోగాలు చేయటం అంటే నాకు బాగా సరదా. సీనియర్ హీరోస్ తో కలిసి నటించటానికి కూడా నేనెప్పుడూ అభ్యంతరాలు తెలుపలేదు. కానీ కథా రచయితలకు కొన్ని షరతులు మాత్రం పెడుతుంటాను. ఇద్దరు స్టార్ హీరోస్ ఒకే సినిమాలో కనిపిస్తున్నారంటే అభిమానులలో అంచనాలు భారీగా ఉంటాయి. ఇద్దరు స్టార్స్ పోషించే పాత్రలు కథలో సమ ప్రాధాన్యం కలిగినవై ఉండాలి. ఏ ఒక్కరి పాత్ర కొద్దిగా తక్కువ చేసినట్టు అనిపించినా అభిమానులు నొచ్చుకుంటారు. అందుకే స్టార్స్ చేసే మల్టీ స్టారర్స్ విషయంలో ఈ షరతులను ఎప్పుడూ సడలించను. నేను కోరుకున్నట్టు సమ ప్రాధాన్యమున్న రెండు బలమైన కథానాయకుడి పాత్రలతో కథ తీసుకుని ఏ రచయిత వచ్చినా నేను చిరంజీవి గారితో, బాల కృష్ణ గారితో, వెంకటేష్ గారితో కలిసి నటించటానికి సిద్ధం గానే వున్నాను." అంటూ మల్టీ స్టారర్స్ చేస్తాను కానీ కండిషన్స్ అప్లై అంటూ నొక్కి చెప్తున్నారు కింగ్ నాగార్జున.

Similar News