సత్యభామలో బాస్కెట్ బాల్ టోర్నమెంట్ ప్రారంభించిన భామ

Update: 2017-02-27 07:16 GMT

తాజాగా సౌత్ సినిమా హీరోయిన్ కాజల్ అగర్వాల్ తన నట జీవితంలో దశాబ్ద కాలం పూర్తి చేసుకుని నేటి తరం లో చాలా అరుదుగా కథానాయికలకు దక్కే ఈ రికార్డు ని సాధించింది. 2007 లో తేజ దర్శకత్వంలో నటించిన లక్ష్మి కళ్యాణం చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు కథానాయికగా పరిచయమైన కాజల్ అగర్వాల్ తిరిగి దశాబ్ద కాలం తరువాత మళ్లీ తేజ దర్శకత్వంలో దగ్గుబాటి రానా సరసన పొలిటికల్ డ్రామా కమ్ థ్రిల్లర్ లో నటిస్తోంది. తెలుగులో రకుల్ ప్రీత్ సింగ్, రాశి ఖన్నా వంటి భామల జోరుతో కాజల్ సినిమాల సంఖ్య కొద్దిగా నెమ్మదించినప్పటికీ చేస్తున్న ఒకటి అరా చిత్రాలు మాత్రం అగ్ర కథానాయకుల సరసన చేస్తుండటంతో అమ్మడి క్రేజ్ కి ఢోకా ఉండటం లేదు. ఈ ఏడాదికి మెగా స్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150 చిత్రంలో కథానాయికగా స్వాగతం చెప్పిన కాజల్ ప్రస్తుతం తమిళ అగ్ర కథానాయకుడు అజిత్ సరసన నటిస్తుండటం తో పాటు మరో అగ్ర కథానాయకుడు విజయ్ నటించబోయే తదుపరి చిత్రంలో ఒక కథానాయికగా ఎంపిక ఐయ్యింది.

మూడు లేదా నాలుగు చిత్రాలు కాజల్ చేతిలో ఉంటున్నప్పటికీ సెట్స్ పై మాత్రం ఒకసారి ఒకే చిత్రం ఉంటోంది. అందుకే తన తీరిక సమయాన్ని కుటుంబంతో గడుపుతూ, ఆ వ్యక్తిగత విలాసాలను కూడా కాష్ చేసుకునే ప్లాన్లు వేస్తోంది. మొన్న శివ రాత్రి పండుగని కోయంబత్తూరు లో ఇషా ఫౌండేషన్ లో సద్గురు సన్నిధిలో జరుపుకోవటానికి వెళ్లిన కాజల్, అక్కడ కొన్ని షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ కార్యక్రమాలు చేసింది. వీటితో పాటు కోయంబత్తూరు నుంచి తిరిగి వస్తూనే చెన్నైలోని సత్యభామ యూనివర్సిటీ లో బాస్కెట్ బాల్ లీగ్ టోర్నమెంట్ కార్యక్రమానికి తన సోదరి ఇషా అగర్వాల్ తోపాటు హాజరు ఐయ్యింది. మొత్తం మీద కాజల్ కి ప్రస్తుతం సినిమా షూటింగ్స్ కాల్ షీట్స్ పై ఆదాయంతో పాటు ఇతరత్రా కార్యక్రమాలకు చేకూరే ఆదాయం కూడా బాగానే ఉంటోంది.

Similar News