సగం లుక్ తోనే చంపేస్తున్నాడు!!

Update: 2016-12-28 23:00 GMT

పవన్ తాజా చిత్రం 'కాటమరాయుడు' షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే పవన్ క్రిష్టమస్ హాలిడేస్ తీసుకుని కొన్ని రోజులపాటు షూటింగ్ కి హాజరుకాకపోయినా... ఇతర ఆర్టిస్టుల సన్నివేశాలను డైరెక్టర్ డాలి తెరకెక్కించాడు. అయితే 'కాటమరాయుడు' కి సంబంధించి చాలా కాలం నుండి కొన్ని వార్తలు ప్రచారంలోకొచ్చాయి. పవన్ కళ్యాణ్ అలిగి షూటింగ్ నుండి వెళ్లిపోవడం మొదలు శృతి హాసన్ పై పవన్ కోప్పడ్డాడని... ఇలా అనేకమైన రూమర్స్ ప్రచారం లోకొచ్చాయి. అయితే ఈ రూమర్స్ కి బ్రేక్ వేస్తూ పవన్, శృతి హాసన్ ఉన్న ఫస్ట్ లుక్ పోస్టర్ ని దీపావళి కానుకగా విడుదల చేశారు. ఇక 'కాటమరాయుడు' ఫస్ట్ లుక్ కి పవన్ ఫ్యాన్స్ నుండేకాక మిగతా ప్రేక్షకుల నుండి కూడా విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది.

ఇక ఇప్పుడు న్యూ ఇయర్ పోస్టర్ అంటూ పవన్ కళ్యాణ్ ముఖాన్ని చూపించకుండా కేవలం మోకాళ్ళ దగ్గరనుండి మాత్రమే చూపిస్తూ కొత్త 'కాటమరాయుడు' పోస్టర్ ని విడుదల చేశారు. ఇక పోస్టర్ తో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ న్యూ ఇయర్ అప్పుడే వచ్చేసిందా అనే లెవల్లో హంగామా చేసేస్తున్నారు. న్యూ ఇయర్ కానుకగా 'కాటమరాయుడు' చిత్రం ఫస్ట్ టీజర్ ని విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. న్యూ ఇయర్ పోస్టర్ తో పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్ ఇక టీజర్ ని ఎప్పుడెప్పుడు చూస్తామా అని కాచుకు కూర్చున్నారు. అయితే సినిమాని వీలైనంత తొందరలో పూర్తి చేసి వచ్చే ఉగాదికి 'కాటమరాయుడు' చిత్రాన్ని విడుదల చెయ్యాలని చిత్ర యూనిట్ భావిస్తుంది..

Similar News