సంపూ ఫ్యాన్స్ చూస్తే చాలంటున్న హీరో

Update: 2016-11-18 08:55 GMT

శంకరాభరణం మిగిల్చిన చేదు జ్ఞాపకాల నుంచి బైటకి వచ్చి ఎక్కడికి పోతావు చిన్నవాడా చిత్రం చేసిన యువ నటుడు నిఖిల్ కు ఈ చిత్ర విజయం కీలకం కానుంది. ఈ రోజు విడుదల కానున్న ఈ చిత్రానికి ప్రస్తుతం పెద్ద నోట్ల రద్దు వలన చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న ఆర్ధిక ఇబ్బందులు ఎక్కడికి పోతావు చిన్నవాడా చిత్రాన్ని తాకకుండా ప్రచారంలో ఊపు పెంచి విరామం లేకుండా కష్టపడ్డాడు నిఖిల్. ఇంత కాలం పడిన కష్టానికి ఫలితం తేలే సమయం ఆసన్నమవటంతో నిద్ర కూడా పట్టటంలేదు అంటూ ట్వీట్ చేసాడు నిఖిల్.

ఈ ట్వీట్ కు ప్రతి స్పందనగా నిఖిల్ కు ధైర్యం చెప్తూ చిత్రానికి బెస్ట్ విషెస్ చెప్తూ కొందరు సినిమా సెలబ్రిటీస్ రీట్వీట్ చేశారు. వారిలో బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు కూడా వున్నారు. సంపూర్ణేష్ బాబు తన ట్వీట్ ద్వారా నిఖిల్ కి మరియు ఎక్కడికి పోతావు చిన్నవాడా చిత్రానికి పని చేసిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులకు ఆల్ ది బెస్ట్ చెప్తూ ట్వీట్ చెయ్యగా నిఖిల్ ప్రతి స్పందనగా, "మీ అభిమానులు అందరూ మా సినిమా ను ఒక్క సారి చూస్తే చాలు సర్, మేము విజయ శిఖరాలను అధిగమించేస్తాం." అని రీట్వీట్ చేసాడు నిఖిల్.

Similar News