షూటింగ్ కి వీరు పడ్డ పాట్లు అన్నీ ఇన్నీకావు

Update: 2017-02-01 14:04 GMT

ప్రస్తుతం బాలీవుడ్ లో ది మోస్ట్ అవైటెడ్ మూవీస్ జాబితాలో అగ్ర స్థానంలో నిలిచింది రంగూన్ చిత్రం. రెండవ ప్రపంచ నేపధ్యం లో సాగే ఈ చిత్ర కథలో చారిత్రాత్మక అంశాలను కొత్త కోణంలో తెరకెక్కించటమే ఇందుకు కారణం. పైగా రంగూన్ ప్రచార చిత్రం విడుదలైన నాటి నుంచి షాహిద్ కపూర్-కంగనా రనౌత్, సైఫ్ అలీ ఖాన్-కంగనా రనౌత్ ల మధ్య ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బాగా పండింది అని సోషల్ మీడియా లో హాట్ టాపిక్ అయిపోయింది. దానికి తగ్గట్టే చిత్ర బృందం ప్రచారం లో ఖర్చు కి వెనుకాడకుండా రంగూన్ చిత్రాలని అన్ని వర్గాల ప్రేక్షకాకులలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. రంగూన్ లో లీడ్ రొలెస్ చేసిన హీరో హీరోయిన్స్ ఇప్పటికే సిసిల మీడియాలో లైవ్ చాట్ లలో పాల్గొంటూ అభిమానులతో నేరుగా ముచ్చటిస్తూ రంగూన్ చిత్ర అనుభవాలను పంచుకుంటున్నారు.

షాహిద్ కపూర్, కంగనా రనౌత్ లు కలిసి చేసిన ఒక సోషల్ ఈవెంట్ లో భాగంగా రంగూన్ చిత్ర ప్రస్తావన తీసుకు వచ్చి అరుణాచల ప్రదేశ్ రాష్ట్రం లో ఇప్పటి వరకు ఎవరూ షూటింగ్స్ జరపని కొన్ని లొకేషన్స్ లో షూటింగ్ చేయాల్సి రాగా ఆ లొకేషన్స్ లో షూటింగ్ ఒక ట్రెక్కింగ్ లా ఉండేదని, చిత్రీకరణకు కావలసిన సామగ్రి చేరవేయటమే పెద్ద టాస్క్ అయిపోయేది అని షాహిద్ కపూర్ చెప్పగా, అన్నీ ఓపెన్ గ మాట్లాడేసే కంగనా రనౌత్, "అరుణాచల్ ప్రదేశ్ లో మేము చేసిన లొకేషన్స్ లో వాష్ రూమ్స్ కూడా ఉండేవి కావు. కొండల వెనుకకి వెల్లాసి వచ్చేది. అక్కడ క్లైమేట్ కూడా చాలా ఎక్సట్రీమ్స్ లో ఉండేది. అక్కడి నీళ్లు మంచు గడ్డ లా ఉండేవి. ఆ ప్రదేశాలలో కూడా మేము షూటింగ్ చేసాం. ఆ సన్నివేశాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి." అంటూ రంగూన్ చిత్రీకరణకు టీం సభ్యులు పడిన కష్టాన్ని వివరించింది కంగనా రనౌత్.

Similar News