షాక్ ఇచ్చిన సమంత!!

Update: 2017-03-08 08:11 GMT

ఓంకార్ డైరెక్షన్ లో వచ్చిన 'రాజుగారి' గది చిన్న సినిమాగా విడుదలై ఎంతటి సంచలనాలను సృష్టించిందో తెలిసిన విషయమే. దానికి సీక్వెల్ గా ఓంకార్ 'రాజుగారి గది 2 ' ని తెరకెక్కిస్తున్నాడు. ఇక ఇందులో కింగ్ నాగార్జున ఒక ముఖ్య పాత్ర పోషిస్తుండగా ఆయనకు కాబోయే కోడలు సమంత కూడా ఒక రోల్ చేస్తుంది. ఇందులో మానసిక వైద్యుడిగా నాగార్జున స్టైలిష్ పాత్రలో కనిపి౦చనున్నాడు. అయితే తాజాగా నాగ్ 'రాజుగారి గది 2 ' షూటింగ్లో జాయిన్ అయ్యానని చెప్పడానికి ఒక ఫొటోతో పాటే 'కింగ్ ఈజ్ బ్యాక్ టు రాజుగారి గది 2 ' అంటూ పోస్ట్ చేసాడు.

ఇక సమంత కూడా అ౦దరిని సర్ప్రైజ్ చేస్తూ రాబోతున్న 'రాజు గారి గది‍ 2'లో ఘోస్ట్ గా సమ౦త కనిపి౦చే అవకాశ౦ వు౦దని ఫిలి౦నగర్ టాక్. ఇక సమంత కూడా 'రాజు గారి గది‍ 2' షూట్ లో జాయిన్ అయిపోయినట్లుంది. అందుకే తన ఫోటోని ఒకటి సమంత సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అందులో సమంత 'రాజుగారి గది' లో పూర్ణ దెయ్యం రోల్ లో కనిపించినట్టు పార్ట్ 2 లో దెయ్యం పాత్ర చేస్తుందా... అని అనిపించక మానదు. ఆ ఫోటో చూసిన వారికీ సమంత దెయ్యం లాగా కనిపిస్తుందని అని అంటున్నారు. అంటే అందమైన దెయ్యం అన్నమాట.

మానసిక వైద్యుడిగా నాగార్జున స్టైలిష్ పాత్రలో కనిపి౦చనున్న ఈ చిత్ర౦లో సీరత్ కపూర్ తో పాటు దర్శకుడు ఓ౦కార్ తమ్ముడు అశ్విన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఓ పాడుబడిన బూత్ బ౦గ్లాలో ప్రతీకార౦ కోస౦ ఎదురుచూసే ప్రేతాత్మగా సమ‌౦త పాత్ర వు౦టు౦దని, ఆమె పాత్రే సినిమాకు ప్రధాన హైలైట్ అని విశ్వసనీయ సమాచార౦. కెరీర్ ప్రార౦భ౦ ను౦చి గ్లామర్ పాత్రల్లో ఆకట్టుకున్న సమ౦త మరి ఘోస్ట్ పాత్రలో ఏస్థాయిలో షాకివ్వను౦దో.. తెలియాల౦టే మరిన్ని రోజులు వేచిచూడాల్సి౦దే.

Similar News