షాకింగ్ లుక్ లో నాగ్

Update: 2017-09-20 11:00 GMT

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మన్మధుడిగా పేరున్న నాగార్జున కు వయసు ఎంతున్నా ఇప్పటికి యంగ్ హీరోలానే కనబడతాడు. ఆయన కొడుకులు ఇద్దరూ పెళ్ళికి ఎదిగినా కూడా కొడుకులకు అందం లో గట్టి పోటీ ఇచ్చే స్థాయిలో నాగార్జున ఉన్నాడు. ఇప్పుడు నాగార్జున రాజుగారి గది 2 లో ఒక మానసిక వైద్యుడిగా నటించడమే కాక, నాగచైతన్య పెళ్లిపనుల్లోను, అఖిల్ రెండో సినిమా హలో కి నిర్మాతగానూ ఫుల్ బిజీగా వున్నాడు. ఇక నాగార్జున నటించిన రాజుగారి గది 2 సినిమా విడుదలకు సిద్దమవుతున్న సందర్భంగా ఆ సినిమా ట్రైలర్ ని లాంచ్ చేసింది చిత్ర బృందం. అయితే ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి విచ్చేసిన నాగార్జున ఒక వెరైటీ లుక్ లో కనబడి అందరికి షాక్ ఇచ్చాడు.

నాగార్జున తన మీసకట్టు తీసేసి ఇలా ప్రేక్షకుల ముందుకు వచ్చి అందరిని ఆశ్చర్యానికి గురి చేసాడు. భక్తి సినిమాల్లో కనబడినప్పుడు మాత్రమే మీసకట్టు తీసేసే నాగార్జున ఇప్పుడు ఎందుకు ఇలాంటి లుక్ లోకి మారాడో అర్ధం కాక అందరూ తెగ ఇదైపోతున్నారు. మరి నాగార్జున ఇలా మీసకట్టు తియ్యడానికి ఏదైనా కారణం ఉందా.. అసలు నాగార్జున ఒప్పుకున్నా సినిమాలో ఏదైనా పాత్ర కోసమే ఇలా చేశాడా.... అంటూ అందరూ తెగ చర్చించేసుకుంటున్నారు. మరి నాగార్జునకు కొత్తగా కమిట్మెంట్స్ అంటూ ఏమీలేవు. ప్రస్తుతానికి నాని, నాగార్జున కలిసి శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో చేసే సినిమా తప్ప. మరి ఆ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకెళుతుందో కూడా క్లారిటీ లేదు. అలాగే చైతు పెళ్లి కూడా అక్టోబర్ 6 నే జరగబోతుంది.

మరి నాగార్జున దేని కోసం తన మీసాన్ని తీసేసాడో గాని ఇప్పుడు ఆ మీసాట్టుమీద బోలెడన్ని వార్తలు ప్రచారంలోకి వచ్చేసాయి. ఇక ఈ రోజు నాగార్జున తండ్రి నాగేశ్వరరావు జయంతి సందర్భంగా రాజుగారి గది 2 ట్రైలర్ ని విడుదల చేశారు.

Similar News