శ్రీయ లైఫ్ పాట్నర్ ఇతనే

Update: 2018-02-28 03:06 GMT

చిన్న హీరో నుండి పెద్ద హీరో దాకా అందరితో పని చేసిన అనుభవం శ్రీయకి ఉంది. గత కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా కొనసాగింది. ప్రస్తుతం ఈ అమ్మడుకి 35 ఏళ్ల వయసు. పెళ్లి గురించి ఎప్పుడు మాట్లాడిన తర్వాత చూద్ద్ధం అని చెప్పి పక్కకు తప్పుకునేది. అయితే లేటెస్ట్ సమాచారం ప్రకారం ఈ అమ్మడు త్వరలో పెళ్లి చేసుకోబోతోంది అని వార్తలు వస్తున్నాయి.

అయితే అందరి హీరోయిన్స్ లాగ ఎవరో హీరో నో.. లేదా ఒక బిజినెస్ మ్యాన్ నో పెళ్లి చేసుకోబోతోందా అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. ఆమె చేసుకోబోయేది ఒక రష్యా దేశ స్పోర్ట్స్ పర్సన్ ని. వచ్చే నెల మార్చి 17, 18, 19 తేదీల్లో ఈమె మూడు రోజుల పెళ్లి చేసుకుంటుంది అని విశ్వసనీయ వర్గాల నుండి అందిన సమాచారం. ఇది నిజమా అని అడిగితే అవునో కాదో అని చెప్పకుండా మీడియాపై విరుచుకుపడింది.

''నా జీవితంలో బోలెడు ఆసక్తికరమైన కథలు ఉన్నాయి. అందుకే నా ప్రొఫెషనల్ లైఫ్ గురించి మాట్లాడుకుందాం. నా ప్రైవేట్ లైఫ్ ని నేను సేల్ కి పెట్టలేదు. నేను ఒక్క యాక్టర్ ని.. నా సినిమాల గురించి మాట్లాడండి నేను మాట్లాడతాను అంతేగాని పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడితే నేను మాట్లాడాను" అని గట్టి సమాధానం ఇచ్చింది.

స్పోర్ట్స్ మాన్ ఆండ్రీ కోస్చీవ్ తో శ్రీయ ఉదయిపూర్ లో మూడు రోజుల పెళ్లి చేసుకుంటోంది. రీసెంట్ గా రష్యా వెళ్లి కాబోయే అత్త మామలని కలిసి వచ్చింది అని శ్రీయకి దగ్గరివారు మీడియాకి విషయం లీక్ చేశారు. మరి ఎంతవరకు నిజమో తెలియాలంటే మార్చి 19 వ తేదీ వరకు ఆగాల్సిందే.

Similar News