శ్రీ రెడ్డి - మాధవీలతలకు కౌంటర్ ఇచ్చిన రకుల్

Update: 2018-04-02 06:37 GMT

టాలీవుడ్ లో ఇప్పుడు ట్రెండ్ అవుతున్న టాపిక్ క్యాస్టింగ్ కౌచ్. ఈ పదం ఏ సినీ ఇండస్ట్రీలో ఐన బాగానే వినిపిస్తది. కానీ టాలీవూడ్ లో ఈ మధ్య ఎక్కువయిందనే చెప్పాలి. ముఖ్యంగా దీనిపై హీరోయిన్స్ స్పందించటంతో ఇది హాట్ టాపిక్ గా మారింది. ఈ క్యాస్టింగ్ కౌచ్ కి వ్యతిరేకంగా శ్రీ రెడ్డి - మాధవి లత స్పందించిన విషయం తెలిసిందే.

లేటెస్ట్ గా ఓ కార్యక్రమంలో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ దీనిపై స్పందించింది. టాలీవుడ్ లో నేను ఎప్పటినుండో వుంటున్న కానీ అలాంటివి ఏమి ఎదురు అవ్వలేదు అని చెప్పడంతో ఒక్కసారిగా క్యాస్టింగ్ కౌచ్ వివాదం ఊపందుకుంది. రకుల్ స్పందించిన తీరును శ్రీ రెడ్డి - మాధవీలత తప్పు బట్టారు. జనాలను పిచ్చొళ్ళని చేస్తున్నావా? అని కౌంటర్లు కూడా ఇచ్చారు.

నువ్వు బాగానే సెటిల్ అయ్యావ్ బిజినెస్ కూడా చేసుకుంటున్నావు అని ఇతర విషయాలను కూడా ప్రస్తావిస్తూ రకుల్ పై మాటలతో విరుచుకుపడ్డారు. అయితే ఈ విషయం రకుల్ కి లేట్ గా తెలియడంతో ఒక్కసారిగా షాక్ అయ్యింది. తనదైన శైలిలో కౌంటర్ కూడా వేసింది. మా అమ్మ నాన్నకు తెలుగు రాదు కాబట్టి సరిపోయింది లేకపోతే ఇలాంటి ఇండస్ట్రీలో నువ్వు వర్క్ చేస్తున్నావా అని అనేవారు. తెలుగు ఇండస్ట్రీని తక్కువ చేసి మాట్లాడకండి అని రకుల్ తెలిపింది.

Similar News