శ్రద్ద సాహో లుక్ ఇదా?

Update: 2018-03-05 11:15 GMT

ప్రభాస్ బాహుబలి తర్వాత సాహో చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. 150 కోట్ల భారీ బడ్జెట్ తో యూవీ క్రియేషన్స్ వారు ఈ సాహో చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఇండియాలోని పలు భాషల్లో తెరకెక్కుతుంది. అందుకే బాలీవుడ్ లో సాహో మర్కెట్ ని దృష్టి లో ఉంచుకుని ప్రభాస్ కి జోడిగా బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ద కపూర్ ని తీసుకున్నారు. ప్రస్తుత సాహో కి సంబందించిన షూటింగ్ విదేశాల్లో జరుగుతుండగా... ఇప్పుడు సాహో లోని శ్రద్ద కపూర్ ఎలా ఉండబోతుందో అనే విషయం బయటికి వచ్చింది. అంటే సాహోలో శ్రద్ద కపూర్ లుక్ ఇప్పుడు లీకై సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

మరి సాహోలో ప్రభాస్ లుక్ మాత్రం హాలీవుడ్ రేంజ్ లో ఉంటె... హీరోయిన్ శ్రద్ద కపూర్ లుక్ మాత్రం చాలా సింపుల్ కనిపిస్తోంది. ప్రస్తుతం లీకైన శ్రద్ద లుక్ బ్రౌన్ కలర్ షర్ట్, ట్రౌజర్ లో శ్రద్ద అలా నడుము మీద చేతులతో నిల్చుని కోపంగా చూస్తుంది. మరి ఇప్పుడే సాహో సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న శ్రద్ద సింపుల్ గా ఉన్న లుక్ మాత్రమే బయటికి వచ్చింది. మరి సినిమాలో ఎలా ఉంటుందో అనేది మాత్రం చాలా కాలం వెయిట్ చెయ్యాల్సిందే. ఎందుకంటే సాహో షూటింగ్ ఎప్పుడు పూర్తవుతుందో అనే దాని మీద ఎటువంటి క్లారిటీ లేదు.

ప్రస్తుతం సుజిత్ డైరెక్షన్ లో ముప్పై కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి సాహో కి సంబందించిన ఓ భారీ యాక్షన్ సీన్ ని తెరకెక్కిస్తున్నారు. మరి ఒక ఫైట్ సీన్ కోసం ఇంత పెద్ద మొత్తంలో ఖర్చుపెట్టడం చాలా అరుదు. ఈ భారీ యాక్షన్ సన్నివేశాలు హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ కెన్నీ గేట్స్ ఆద్వర్యంలో జరిగుతున్నాయి.

Similar News