శృతి హాసన్ నాకన్నా సీనియర్ అంటున్న హీరోయిన్?

Update: 2018-03-22 08:52 GMT

బాలీవుడ్ లో అడపాదడపా సినిమాలు చేసుకుంటూ ఉన్న దిశ పటాని తెలుగులో లోఫర్ చిత్రంతో టాలీవుడ్ కి పరిచయం అయ్యింది. కానీ ఆ సినిమా అట్టర్ ప్లాప్ తో అమ్మడు మళ్ళీ సౌత్ కేసి చూడలేదు. ఇక బాలీవుడ్ నే నమ్ముకున్న ఈ బక్క పల్చటి సుందరి హాట్ హాట్ గా ఒక రేంజ్ లో ఫొటోస్ దిగుతూ సోషల్ మీడియా ని షేక్ చేసి వదిలిపెడుతుంది. అయితే ఈ భామకు ఉన్నట్టుండి సౌత్ నుండి ఒక భారీ ఆఫర్ తగిలింది. తమిళనాట భారీ బడ్జెట్ తో సుందర్ సి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సంఘమిత్ర ప్రాజెక్ట్ లో సంఘమిత్ర టైటిల్ రోల్ పోషించే పాత్ర దిశకి దక్కింది.

ముందు ఈ సినిమాలో సంఘమిత్ర రోల్ కోసం చిత్ర బృందం శృతి హాసన్ ని తీసుకుని శిక్షణ ఇప్పించింది. కానీ శృతి అర్దాంతరంగా తప్పుకోవడంతో ఇప్పుడా ఛాన్స్ దిశాని తగులుకుంది. దిశా పటాని కన్నా ముందు ఆ రోల్ కోసం చాలామంది పేర్లు వినబడినా చివరికి ఆ కేరెక్టర్ దిశా ని వరించింది. అయితే దిశా పటాని ని మీడియా వారు సంఘమిత్ర టైటిల్ రోల్ లో శ్రుతి హాసన్ ను రీప్లేస్ చేశారు .. ఎలా అనిపిస్తోంది... అని అడగగా... కాస్త అసహనానికి లోనైనా దిశా పటాని నేను శృతి హాసన్ ని రీప్లేస్ చెయ్యడమేమిటంటూ.... శృతి హాసన్ నా కన్నా సీనియర్ హీరోయిన్ ,శృతి హాసన్ ని రీప్లేస్ చెయ్యడానికి నేనెవరిని అంటూ అమ్మడు అంతెత్తున లేచింది. అలాగే శృతి హాసన్ తో పోల్చి చూసుకుంటే నేను చేసిన సినిమాలు చాలా తక్కువే. సంఘమిత్ర పాత్ర కోసం దర్శకనిర్మాతలు నన్ను సంప్రదించారు. ఆ ఆఫర్ కి నేను ఓకే చెప్పాను. అసలు ఇంతకుముందు శృతి హాసన్ కి.... సంఘమిత్ర యూనిట్ కి మధ్య ఏం జరిగిందో నాకు తెలియదు. అలాగే ఆ విషయాన్నీ నేను తెలుసుకోవడానికి ప్రయత్నించలేదు. ఆ సంగతులు తెలుసుకోవాలంటే మీరు డైరెక్టర్ ను కలవండి అంటూ ఘాటైన సమాధానం చెప్పింది ఈ దిశా పటాని.

Similar News