శివాని దాన్ని బ్రేక్ చేస్తుందా.. లేదంటే...?

Update: 2018-03-24 10:06 GMT

గతంలో సినిమా ఇండస్ట్రీ నుండి అమ్మాయిలు హీరోయిన్స్ అవుతున్నారు అంటేనే అభిమానుల నుండి ఎన్నో అవాంతరాలు ఎదుర్కొని కామ్ గా ఇంట్లోనే కూర్చునేవారు. కానీ ఈ మధ్యన మాత్రం ఆ పరిస్థితులు లేవు. అందుకే నాగ బాబు తన కూతురిని సినిమా ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయం చేసాడు. అలాగే మోహన్ బాబు కూతురు లక్ష్మి ప్రసన్న హీరోయిన్ గా , సపోర్టింగ్ రోల్స్ లో రాణిస్తుంది. ఇక రాజశేఖర్ - జీవిత దంపతులు కూడా తమ కూతురు శివాజీని ని వెండితెరకు పరిచయం చేస్తున్నారు. ఎప్పటినుండో శివాని తెరంగేట్రంపై వార్తలొస్తున్న... తాజాగా శివాని '2 స్టేట్స్' తో అడివి శేష్ తో కలిసి వెండితెర ఎంట్రీ ఇస్తుంది.

మరి అడవి శేష్ తో కలిసి శివాని '2 స్టేట్స్' తో హిట్ కొట్టి ఎంతోకాలంగా వస్తున్న ఒక విషయాన్నీ బ్రేక్ చేస్తుందా అనే చర్చ ఇప్పుడు ఫిలింసర్కిల్స్ లో హాట్ టాపిక్ అయ్యింది. ఆ విషయమేమిటంటే... సినీ కుటుంబంనుండి వెండితెరకు పరిచయం అయిన హీరోయిన్స్ పెద్దగా సక్సెస్ కాలేదు. వారిలో కృష్ణ కూతురు మంజుల అయితే హీరోయిన్ అవుదామునుకుని సపోర్టింగ్ రోల్స్ చేసి సక్సెస్ సాధించలేక డైరెక్టర్ అయ్యింది. అక్కడా ప్లాప్. అలాగే నాగార్జున మేనకోడలు సుప్రియ, పవన్ కళ్యాణ్ తో కలిసి వెండితెరకు ఎంట్రీ ఇచ్చింది.. ఒక్క సినిమాతోనే సుప్రియ మళ్ళీ వెండితెరవైపు చూడలేదు. అలాగే మోహన్ బాబు కూతురు లక్ష్మి ప్రసన్న కూడా హీరోయిన్ గా సక్సెస్ సాధించలేదు.

ఇక నాగ బాబు గారమ్మాయి నిహారిక, నాగ శౌర్య తో కలిసి నటించిన ఒక మనసు ప్లాప్. మరి తాజాగా నిహారిక ఇంకా తన లక్కు పరీక్షించుకుంటూనే వుంది. తాజాగా సినిమా ఫ్యామిలీ నుండి శివాని ఎంట్రీ. మరి శివాని అయినా సక్సెస్ ఫుల్ గా తన సినిమా ప్రస్థానాన్ని కొనసాగిస్తుందా... అనేది ప్రస్తుతం అందరిముందు ఉన్న అతి పెద్ద డౌట్. వెంకట్ కుంచం అనే కొత్త దర్శకుడు హిందీ '2 స్టేట్స్' ని అదే పేరుతొ తెలుగులోనూ రీమేక్ చేస్తున్నాడు. మరి అడివి శేష్ హీరోగా శివాని హీరోయిన్ గా ఈ రోజు మొదలైన ఈ మూవీ కోసం సినిమా ఇండస్ట్రీలోని అతిరథ మహారథులు తరలి వచ్చారు. రాజశేఖర్ దంపతులు శివాని తో, చిన్న కూతురితో కలిసి రాగా... సినిమా క్లాప్ కొట్టడానికి దర్శక ధీరుడు రాజమౌళి వచ్చాడు. అలాగే సుబ్బరామిరెడ్డి, కృష్ణ రాజు భార్య తో కలిసి ఈ వేడుకకి అటెండ్ అయ్యాడు. మరి ఎంతో గ్రాండ్ గా మొదలైన ఈ సినిమాతో శివాని ఆ సినిమా ఫ్యామిల హీరోయిన్ ప్లాప్ లను బ్రేక్ చేస్తుందా అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది.

Similar News