శివ ని ఆలా వదిలేయటమే మంచిదేమో

Update: 2016-12-24 19:00 GMT

5 అక్టోబర్ 1989 . తెలుగు చలన చిత్ర పరిశ్రమ లో ఈ తేదీ ప్రత్యేక చరిత్ర సృష్టించింది. అప్పటివరకు వున్న అతి గొప్ప రచయితలు, చేయి తిరిగిన దర్శకుల మూస ధోరణితో తెలుగు చిత్రాలకు పట్టిన బూజు ని దులుపుతూ సంచలనాత్మక దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పరిచయ చిత్రం శివ విడుదలై దర్శక నిర్మాతలతో పాటు సినిమా చూసే తీరులో ప్రేక్షకులలోను మార్పు తీసుకొచ్చిన చిత్రం గా నిలిచిపోయింది శివ. తాజా గా విడుదలైన వంగవీటి తన ఆఖరి తెలుగు చిత్రం అంటూ తెలుగు చిత్ర పరిశ్రమలో పలువురు ప్రముఖుల సమక్షంలో శివ టూ వంగవీటి అని తన ప్రయాణం కు సంబంధించి ఒక వేడుక చేసుకున్నాడు ఆర్.జి.వి. ఈ వేడుకలో వర్మ కు అవకాశం ఇచ్చి నూతన శైలి కథను ప్రోత్సహించిన నాగార్జున ను అందరూ కొనియాడగా, నాగార్జున వేదిక పై మాట్లాడుతూ ఎందరో దర్శకులు శివ సీక్వెల్ చేద్దాం అంటూ వచ్చారు కానీ వర్మ అటువంటి ప్రపోసల్ చేస్తే తప్పించి వేరెవరితోనూ ఆ ప్రాజెక్ట్ చేయను అని చెప్పారు నాగ్.

శివ అనంతరం పలు వైఫల్యాలతో సతమతమైన వర్మ పని ఇక అయిపోయింది అనుకున్న నాటికి గాయంతో తన బౌన్స్ బ్యాక్ చూపించి మళ్లీ అందరిని తన వైపు తిప్పుకున్నాడు. అనంతరం తిరిగి వరుస వైఫల్యాలతో విమర్శకుల పని చెప్పిన వర్మ రంగీలా తో ఆయనే వారి నోర్లు మూపించాడు. ఆలా ప్రతి సారి ఇక వర్మ ని ప్రేక్షకులు తిరస్కరించటమే తప్ప ఆశీర్వదించారు అని విమర్శలు వినిపించిన ప్రతి సారి సత్య, కంపెనీ, సర్కార్, రక్త చరిత్ర, 26/11 అటాక్స్, కిల్లింగ్ వీరప్పన్, వంగవీటి చిత్రాలతో ప్రేక్షకులతో పాటు పరిశ్రమ దృష్టిని తన వైపు తిప్పుకున్నాడు. మరో వైపు తనకి ఎంతగానో నచ్చిన చిత్రం షోలే అని ఆ చిత్రాన్ని రీమేక్ చేసి ఆగ్ పేరుతో భూస్థాపితం చేసాడు. అలానే నాగార్జునతో చేయనప్పటికీ శివ చిత్రానికి రీమేక్ గా శివ 2006 అని మోహిత్ అనే బొంబాయి కుర్రాడితో దశాబ్ద కాలం క్రితం సినిమా తీసి ఎదురు దెబ్బ తిన్నాడు. ఈ నేపథ్యంలో నాగ్ తో శివ సీక్వెల్ చేయకుండా ఉండటమే అటు అన్నపూర్ణ స్టూడియోస్ కి ఇటు వర్మ కి శ్రేయస్కరం అని విశ్లేషకుల అంచనా. ఇప్పటికి కూడా శివ సినిమా స్ఫూర్తి తో సినిమాలు తీసే దర్శకులు వున్నారు. కాబట్టి ఆ సినిమా ని ఆలా వదిలేయటమే మంచింది అన్నది సినీ పండితుల అభిప్రాయం.

Similar News