శింబు...సిల్లీ రీజన్!!

Update: 2017-09-18 11:00 GMT

కోలీవుడ్ లవర్ బాయ్ శింబు కెరీర్ ఇపుడు ఆగమ్యగోచరంగా వుంది. ప్రస్తుతం శింబు ఏ సినిమా చేస్తే ఆ సినిమా ప్లాప్ బాట పడుతుంది. శింబు తాజా చిత్రం సరసుడు కూడా శింబు ప్లాపుల లిస్ట్ లో చేరిపోయింది. ఇక ఈ సినిమాని తెలుగులో ఎవరు తీసుకోకపోయేసరికి శింబు తండ్రి టి. రాజేంద్ర స్వయంగా తెలుగులో విడుదల చేసుకున్నాడు. అసలు కోలీవుడ్ లో శింబుకి మార్కెట్ లేకుండాపోయింది. ఇకపోతే శింబు కెరీర్ లో ఉన్న ప్రేమ కథలు మరే హీరో కెరీర్ లో లేవు. ముందు నయనతారని పీకల్లోతు ప్రేమించిన శింబు.... ఇద్దరి మధ్యలో ఏం పొరపొచ్ఛాలొచ్చాయో తెలియదు కానీ... ఇద్దరు ప్రేమకు బ్రేకప్ చెప్పేసి విడిపోయారు. అప్పట్లో శింబు, నయనతార ప్రేమ వ్యవహారం దాదాపు పెళ్లి పీటలవరకు వచ్చి ముగిసింది. తర్వాత శింబు, హన్సికతో.... నయనతార, ప్రభుదేవాతో ఫ్రెష్ గా ప్రేమాయణం స్టార్ట్ చేశారు.

కండిషన్ వల్లనే....

అయితే శింబు ప్రేమ వ్యవహారం హన్సికతో కూడా పెళ్లి వరకు వచ్చి ఆగిపోయింది. కారణాలు తెలియవు గాని శింబు, హన్సికలు మాత్రం విడిపోయారు. అయితే ఇప్పుడు శింబు తండ్రి రాజేంద్ర శింబు - హన్సిక ల ప్రేమ వ్యవహారంపై స్పందించాడు. నయన్ విషయం మాట్లాడలేదు గాని హన్సికతో తన కొడుకు ప్రేమ ఎందుకు బ్రేకప్ అయ్యిందో మాత్రం చెప్పాడు. శింబు, హన్సికని పెళ్లి చేసుకోవాలనుకునే తన ఇంట్లో విషయం చెప్పాడట. అయితే శింబు ఫ్యామిలిలో పెళ్లి తర్వాత అమ్మాయిలు సినిమాల్లో నటించకూడదనే కండీషన్ ఉందట. శింబు తల్లి రాజేందర్ భార్య కూడా పెళ్లికి ముందు సినిమాల్లో నటించినా... పెళ్లితర్వాత ఆమె మళ్ళీ నటించలేదట. అలాగే హన్సికకి కూడా శింబు పెళ్లి తర్వాత నటించకూడదనే కండీషన్ పెట్టాడట. కానీ హన్సిక మాత్రం కుదరదని చెప్పేవారికి ఆ ప్రేమ పెళ్లి పెటాకులైందట. శింబు కేవలం తల్లితండ్రులకు గౌరవం ఇచ్చే ఈ పెళ్లిని వదులుకున్నాడని రాజేందర్ చెబుతున్న వెర్షన్.

విడ్డూరం కాదా?

మరి ఇప్పటికాలంలో హీరోయిన్స్ పెళ్ళై పిల్లలున్నా నటనకు ఏమాత్రం బ్రేక్ ఇవ్వడం లేదు. ఇలాంటి టైం లో శింబు, హన్సిక కు ఇలాంటి కండీషన్స్ పెట్టడం కాస్త విడ్డురంగానే ఉంది. మరి శింబు తల్లితండ్రులకు అంత గౌరవం ఇచ్చేవాడు ఇలా హీరోయిన్స్ తో ప్రేమ వ్యవహారాలు లెక్కకు మించి అయితే నడపడు. మరి రాజేంద్ర ఇన్నాళ్లకు ఇప్పుడు ఈ శింబు ప్రేమ, పెళ్లి వ్యవహారం ఎందుకు బయటికి తీసాడో ఆయనకే తెలియాలి.

Similar News