శారీ లో మెరుస్తూ మంత్రముగ్ధుల్ని చేస్తున్న మలయాళీ భామ

Update: 2017-02-03 09:08 GMT

మోడరన్ దుస్తులలో కొంతమంది కథానాయికలు హాట్ గా కనిపిస్తూ యూత్ ని ఆకర్షిస్తుంటే చాలా కొద్ది మంది కథానాయికలు మాత్రమే చీరలలో తమ అట్రాక్టివ్ లుక్స్ తో ఆకట్టుకుంటారు. మళయాళ ప్రేమమ్ చిత్రంలో మలార్ పాత్ర లో కనీస మేకప్ కూడా లేకుండా సహజ అందాలతో కనిపించిన మళయాళ భామ సాయి పల్లవి నటించిన ఒక్క తెలుగు సినిమా కూడా ఇప్పటి వరకు విడుదల కానప్పటికీ మలయాళ ప్రేమమ్ క్రేజ్ తో తెలుగు వారందరికీ సుపరిచితురాలైయ్యింది సాయి పల్లవి. తెలుగు లో నాగ చైతన్య ప్రేమమ్ లో మలయాళం లో మలార్ పాత్రను తెలుగు లో శృతి హాసన్ పోషించి నిరూపించుకున్నప్పటికీ మలార్ పాత్రలో సాయి పల్లవి వేసిన ముద్రని తెలుగు ప్రేక్షకులు కూడా మర్చిపోలేకపోయారు. ఫిదా చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టబోతున్న సాయి పల్లవి శారీ ఫోటో షూట్లతో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అవుతోంది.

ఫిదా లో వరుణ్ తేజ్ సరసన ఫీల్ గుడ్ లవ్ స్టోరీ లో నటిస్తున్న సాయి పల్లవి ని మిస్టర్ కూల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తనదైన శైలిలో ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఇప్పటి తరం దర్శకులలో కథానాయికలని చీరలలో కూడా అందంగా చూపగలిగిన దర్శకులలో గౌతమ్ వాసు దేవ్ మీనన్ తరువాత స్థానం శేఖర్ కమ్ములకే దక్కుతుంది. ఆనంద్, హ్యాపీ డేస్ చిత్రాలతో కమలిని ముఖర్జీ ని స్క్రీన్ పై శేఖర్ కమ్ముల ప్రాజెక్ట్ చేసిన తీరు ఇందుకు నిదర్శనం. ఈ శారీ ఫోటో షూట్ తో హల్చల్ చేస్తున్న సాయి పల్లవి ని మరి ఈ మిస్టర్ కూల్ డైరెక్టర్ ఇంకెంత అందంగా చూపిస్తాడో అని సాయి పల్లవి తాజా ఫోటో షూట్ చుసిన వారంతా ఫిదా చిత్రం కోసం ఎదురు చూస్తున్నారు. వరుణ్ తేజ్ మిస్టర్ విడుదలైన రెండు నుంచి మూడు నెలల సమయానికి ఫిదా విడుదలకి సిద్ధమవుతుందని తెలుస్తుంది.

Similar News