శాతకర్ణి వాయిదాకైనా రెడీ, నాణ్యతలో రాజీ పడం

Update: 2016-10-10 08:19 GMT

గొప్ప కళాత్మకత ఉన్న దర్శకులు కూడా తెలుగు చిత్ర పరిశ్రమలో విజయవంతం కావటానికి ఎంచుకున్న కథలో వాణిజ్య అంశాలను జోడిస్తున్న రోజులలో కథను ఎటువంటి అదనపు హంగు ఆర్భాటాలు చేర్చకుండా కథను కథలానే తెరపై ఆవిష్కరించే అరుదైన దర్శకుడు జాగర్లమూడి రాధ క్రిష్ణ (క్రిష్). అంతటి అభిరుచి గల దర్శకుడు కాబట్టే ఎంతో మంది అగ్ర దర్శకులు పోటీలో ఉన్న బాలయ్య 100వ చిత్రాన్ని దర్శకత్వం చేసే అవకాశం సొంతం చేసుకున్నాడు క్రిష్. ఆ చిత్రమే గౌతమీ పుత్ర శాతకర్ణి. ఈ చిత్రాన్ని 2017 సంక్రాంతికి విడుదల చేస్తామని చిత్రీకరణ మొదలైన రోజే ప్రకటించేసారు.

గౌతమీ పుత్ర శాతకర్ణి చిత్రీకరణ సమయంలోనే దర్శకుడు క్రిష్ వివాహం జరిగింది. అందు కారణంగా అనుకున్న చిత్రీకరణ షెడ్యూల్ సమయానికి పూర్తి చెయ్యటంలో కొంత జాప్యం జరిగింది అని, కానీ ప్రకటించిన సమయానికి చిత్రం విడుదల చెయ్యాలనే నెపంతో నాణ్యత విషయంలో రాజీపడి చుట్టేస్తున్నారని తాజాగా వస్తున్న అపోహలకు స్పందించి దర్శకుడు క్రిష్ వివరణ ఇచ్చారు. "గౌతమీ పుత్ర శాతకర్ణి మా బృందం మొత్తం ప్రతిష్టాత్మకంగా తీసుకుని శక్తి వంచన లేకుండా కష్ట పది పని చేస్తున్నాం. ఇప్పటి వరకు అనుకున్న షెడ్యూల్ పరంగానే చిత్రీకరణ పూర్తి ఐయ్యింది. ఇది బృందం మొత్తం సహకరాంతో జరిగింది. తదుపరి చిత్రీకరణ కూడా అనుకున్న సమయానికే పూర్తి అవుతుంది అనే నా ప్రగాఢ నమ్మకం. అన్ని నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి చేసి సంక్రాంతికే చిత్రాన్ని విడుదల చేస్తాం. ఒకవేళ చిత్రీకర కానీ, నిర్మాణాంతర కార్యక్రమాలు కానీ ఆలస్యం జరిగితే చిత్ర విడుదలనైనా వాయిదా వేస్తాం కానీ రాజి పడి నాసి రకపు చిత్రాన్ని ప్రేక్షకుల ముందు ఉంచను." అని స్పష్టత ఇచ్చారు క్రిష్.

గౌతమీ పుత్ర శాతకర్ణి చిత్రంలో నందమూరి బాల క్రిష్ణ సరసన శ్రీయ శరన్ నటిస్తుండగా, హేమ మాలిని ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. చిరంతన్ భట్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు

Similar News