శాటిలైట్ హక్కులలోనూ మన్మధుడిదే పైచేయి

Update: 2016-11-30 13:50 GMT

90 ల దశకం నాటికి సూపర్ స్టార్ కృష్ణ, అందాల నటుడు శోభన్ బాబు, రెబెల్ స్టార్ కృష్ణం రాజు వంటి వారు కథానాయకులుగా చిత్రాలు తగ్గించేయగా నాటి యువ తరం కథానాయకులు మెగా స్టార్ చిరంజీవి, నందమూరి బాల కృష్ణ, అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్ లు వరుస చిత్రాలతో స్టార్ స్టేటస్ సంపాదించుకుని అగ్ర తారలుగా ఎదిగారు. కాగా నేటికీ చిరంజీవి, వెంకటేష్ లకు 40 కోట్ల క్లబ్లో స్థానం లేదు. లెజెండ్ చిత్రంతో బాలయ్య, సోగ్గాడే చిన్ని నాయనా చిత్రంతో నాగార్జున ఆ ఘనత సాధించగా నాటి తరం స్టార్ హీరోస్ నలుగురిలోనూ అత్యధిక వసూళ్లు సాధించిన రికార్డు సోగ్గాడే చిన్ని నాయనా చిత్రంతో నాగ్ పేరిటనే వుంది.

ప్రస్తుతం ఓం నమో వెంకటేశాయ, రాజు గారి గది 2 చిత్రాలలో నటిస్తున్న నాగార్జున ఇప్పుడు మరో అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు. చిత్రీకరణ దశలో వున్న ఓం నమో వెంకటేశాయ శాటిలైట్ హక్కులను 12 .5 కోట్ల రూపాయలకు ప్రముఖ సంస్థ ఈ టీవీ దక్కించుకుంది. నేటికీ నాగ్ రాఘవేంద్రరావు కలయికలో భక్తిరస చిత్రం అన్నమయ్యకు టీఆర్పీ రేటింగ్స్ అధికంగా ఉండటమే ఓం నమో వెంకటేశాయ కు ఈ ఫాన్సీ రేట్ లభించటానికి కారణంగా తెలుస్తుంది. నాగ్ కెరీర్ లో ఇదే అత్యధిక శాటిలైట్ రేట్ కాగా తన సమకాలీన ఇతర నటులలో నాగ్ ఈ విషయంలోనూ అగ్ర స్థానంలోనే నిలిచారు.

Similar News