శంకర్‌ రక్షణ కవచం...!

Update: 2016-03-15 14:44 GMT

శంకర్‌-రజనీ-అక్షయ్‌ల కాంబినేషన్‌లో వస్తున్న 'రోబో2.0'కి భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. ఈ చిత్రం షూటింగ్‌ ఏడాదిపాటు జరుగనుంది. కాగా ఈచిత్రం బడ్జెట్‌ 350కోట్లు. అంటే రోజుకు కోటి రూపాయల ఖర్చన్నమాట...! కాగా చిత్రం విషయంలో శంకర్‌ అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అందుకోసం ఈ చిత్రానికి కొత్త రక్షణ కవచం ఏర్పాటు చేశాడు. ఆయన ఈ చిత్రానికి 350కోట్ల రూపాయలకు ఇన్సూరెన్స్‌ పాలసీ తీసుకున్నాడు, సినిమాపరంగా అనుకోని సంఘనలు ఏమైనా జరిగితే నిర్మాతలకు ఇబ్బంది లేకుండా చూడాలనే ఉద్దేశ్యంతోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నాడు. గతంలో కూడా ఆయన 'రోబో, ఐ' చిత్రాలకు ఇన్సూరెన్స్‌ పాలసీ తీసుకున్న సంగతి తెలిసిందే. కాగా మరోవైపు రజనీకాంత్‌ నటించిన 'కబాలి' చిత్రం షూటింగ్‌ పూర్తి కావడంతో ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్‌ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈచిత్రం ఫస్ట్‌లుక్‌ ఫొటోలు సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈచిత్రం మొదటి ట్రైలర్‌ను తమిళ నూతన సంవత్సరం కానుకగా ఏప్రిల్‌ 14న విడుదల చేయనున్నారు. ఇక చిత్రాన్ని మేనెలో ప్రేక్షకుల ముందుకు తెచ్చే విధంగా ప్లాన్‌ చేస్తున్నారు.

Similar News