వెంకీతో తరుణ్?

వెంకటేష్ గత ఏడాది బాగా గ్యాప్ తీసుకున్నాక ఎఫ్ 2 వంటి బ్లాక్ బస్టర్ తో ప్రేక్షకులను మెప్పించాడు. తర్వాత వెంకటేష్ చైతు తో కలిసి వెంకిమామ [more]

Update: 2019-06-05 03:36 GMT

వెంకటేష్ గత ఏడాది బాగా గ్యాప్ తీసుకున్నాక ఎఫ్ 2 వంటి బ్లాక్ బస్టర్ తో ప్రేక్షకులను మెప్పించాడు. తర్వాత వెంకటేష్ చైతు తో కలిసి వెంకిమామ షూటింగ్ లో వాలిపోయాడు. వరస మల్టీస్టారర్లు తో వెంకటేష్ అదరగొట్టడడమే కాదు.. వరస ప్రాజెక్టులతో బాగా బిజీగా మారిపోయాడు. వెంకిమామ కూడా ఈ ఏడాది చివరిలోకి విడుదలకు ఏర్పాట్లు చేస్తున్నారు మేకర్స్. ఇంకా వెంకీ లిస్ట్ లో దర్శకుడు త్రినాధరావు ఉన్నాడు. ఇక తాజాగా మరో సినిమాకి వెంకటేష్ కమిట్ అయినట్లుగా చెబుతున్నారు.

అది కూడా పెళ్లి చూపులు తో హిట్ కొట్టి ఈ నగరానికి ఏమైంది తో ప్లాప్ కొట్టిన తరుణ్ భాస్కర్ తో వెంకటేష్.. సురేష్ ప్రొడక్షన్స్ లో మూవీ చేయబోతున్నాడట. సురేష్ ప్రొడ్యూసన్స్ లో సరేష్ బాబు నిర్మిసున్నఈ సినిమా స్క్రిప్ట్ ఎప్పుడో పూర్తయ్యిందని… త్వరలోనే తరుణ్ భాస్కర్ –  వెంకీ కాంబో మూవీ పట్టాలెక్కబోతుందని అంటున్నారు. మరి అలాంటి ఇలాంటి కథ అయితే సురేష్ బాబు కి నచ్చదు. అలాంటిది ఎలాంటి కథతో తరుణ్ భాస్కర్, సురేష్ బాబు ని మెప్పించాడో మరి. నిజంగానే ఓ మాదిరి కథని సురేష్ బాబు ఒప్పుకోడు. అలా ఒప్పుకున్నాడు అంటే.. ఆ కథలో ఏదో విషయముందనుకోవాలి. ఇక వెంకీ -తరుణ్ మూవీ పక్కాగా పట్టాలెక్కబోతుందట.

Tags:    

Similar News