వెంకీతో చిందులేయనున్న పంజాబీ భామ...!

Update: 2016-03-19 23:36 GMT

ప్రస్తుతం వెంకటేష్‌ హీరోగా మారుతి దర్శకత్వంలో సితార క్రియేషన్స్‌, సురేష్‌ ప్రొడక్షన్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'బాబు బంగారం'. ఈ చిత్రం షూటింగ్‌ ఎలాంటి హడావుడి లేకుండా వేగంగా జరుగుతోంది. ఇందులో నయనతార వెంకీ సరసన హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈచిత్రం పాటలను

రికార్డింగ్‌ చేసే పనిలో గిబ్రాన్‌ బిజీగా ఉన్నాడు. ఈ చిత్రంలో ఓ ఐటం సాంగ్‌ ఉందని తెలుస్తోంది. ఈపాటలో పంజాబీ మోడల్‌ సోనమ్‌ భజ్వా నటించనుందని తెలుస్తోంది. త్వరలో ఈ పాటను చిత్రీకరించనున్నారు. కాగా ప్రస్తుతం ఈ పంజాబీ భామ సోనమ్‌భజ్వా సుశాంత్‌ హీరోగా నటిస్తున్న 'ఆటాడుకుందాం..రా' చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. మొత్తానికి 'బాబు బంగారం' చిత్రంలోని ఈ ఐటం సాంగ్‌ చిత్రానికి హైలైట్‌ అవుతుందని మారుతి భావిస్తున్నాడు.

Similar News