వీళ్ళు ఓకె.. వాళ్లేందుకు రాలేదో?

Update: 2018-03-30 07:27 GMT

బాలకృష్ణ తన తండ్రి బయో పిక్ అంగరంగ వైభవంగా తన తండ్రి నిర్మించిన రామ కృష్ణ స్టూడియో లో లాంచ్ చేసాడు. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ నుండి పాలిటిక్స్ నుండి అతిరధ మహారథులు హాజరయ్యారు. మరి బాలయ్య తేజ కాంబో లో వస్తున్న ఈ సినిమా ఓపెనింగ్ షాట్ అదరగొట్టేస్తుంది. అచ్చం తండ్రిలా అభినయం చేస్తూ తన తండ్రి సినిమాలోని డైలాగ్స్ ని దుసుర్యోధనుని పాత్రలో బాలకృష్ణ చీల్చి చెండాడాడు. ఈ ఓపెనింగ్ కార్యక్రమానికి నందమూరి కుటుంబ సభ్యులలో 95 శాతం మంది హాజరైయ్యారు. అందులో హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, చంద్రబాబు ఫ్యామిలీ తప్ప మిగతావాళ్ళు అందరూ దాదాపుగా ఎన్టీఆర్ బయో పిక్ లాంచ్ కార్యక్రమానికి విచ్చేసారు.

మరి నందమూరి ఫ్యామిలిలో ఉన్న విభేదాలు ఈ కార్యక్రమంలో స్పష్టంగా బయటపడ్డాయి. కళ్యాణ్ రామ్ ఈ కార్యక్రమానికి హాజరయిన హరికృష్ణ మాత్రం చిన్న కొడుకు ఎన్టీఆర్ ని పిలవలేదని అలిగి ఈ కార్యక్రమానికి విచ్చేయ్యలేదు. మరి ఈ విషయం అందరికి తెలిసిందే. అయితే బాలకృష్ణ బావగారు, వియ్యంకుడు అయిన ఏపీ సీఎం చంద్రబాబు రాలేదు. ఆఖరికి బాలయ్య అల్లుడు లోకేష్ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేయ్యలేదు. మరి చంద్రబాబు నాయుడు గనక ఈ కార్యక్రమానికి వస్తే ఎన్టీఆర్ బయో పిక్ లో చంద్రబాబుకి అనుకూలంగా తీస్తున్నారని అపవాదు మూటగట్టుకోవాల్సి వస్తుందనా... లేదంటే బాబు గారికి ఖాళీ లేక హాజరవలేదా అనేది తెలియదు గాని.. చంద్రబాబు ఈ ఓపెనింగ్ కి రాకపోవడం మాత్రం ఇప్పుడు పొలిటికల్ గా కూడా చర్చనీయాంశమైంది.

మరి బాలకృష్ణ తన తండ్రి బయో పిక్ ఎన్టీఆర్ సినిమా విషయంలో నిక్కచ్చిగా జరిగింది చూపిస్తాడా? లేదంటే తనకు అనుకూలంగా వున్నవి మాత్రమే పరిగణనలోకి తీసుకుంటాడో తెలియదు గాని.. ఈ సినిమాలో చంద్రబాబు, లక్ష్మి పార్వతి పాత్రలను ఎలా డిజైన్ చేసాడో అనే క్యూరియాసిటీ మాత్రం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల్లో ఉంది. ఇకపోతే ఈ సినిమాలో బాలయ్య 50 నుండి 60 కేరెక్టర్స్ వేస్తాడని తెలుస్తుంది. అలాగే బాలకృష్ణ ఇంకా ఈ సినిమాకి సంబందించిన నటీనటులను పూర్తిగా ఎంపిక చెయ్యలేదు. ఎందుకంటే ఈ సినిమాకి దర్శకుడు తేజ డమ్మీనే. అంతా బాలయ్య ఆధ్వర్యంలోనే జరుగుతుందనేది మాత్రం ఇక్కడ అందరికి తెలియాల్సిన విషయం.

Similar News