వీరి కాంబినేషన్ లో రాబోతున్న చిత్రం ఇదేనా?

Update: 2017-05-27 05:55 GMT

టాలీవుడ్ మోస్ట్ హప్పెనింగ్ స్క్రిప్ట్ రైటర్ కం డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ స్టార్ హీరోస్ తో సినిమాలు చేసి భారీ నుంచి అతి భారీ విజయాలు అందుకోవటమే కాకుండా యువ హీరో నితిన్ తో ఆ ఆ చిత్రం చేసి నితిన్ ట్రాక్ రికార్డు గా మలిచి తన సత్తా చాటుకున్నాడు. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా కోసం శ్రమిస్తున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ మరో వైపు వినూత్న కథాంశాలతో వస్తున్న యువ దర్శకులని ప్రోత్సాహిస్తూ నిర్మాతగానూ మారాడు. అయితే తనతో పనిచేసిన హీరోస్ ని రిపీట్ చేసే అలవాటు వున్నా త్రివిక్రమ్ శ్రీనివాస్ త్వరలో యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ తో తొలి సారి సినిమా చేయనున్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం తారక్ జై లవ కుశ ప్రాజెక్ట్ లో, త్రివిక్రమ్ పవర్ స్టార్ హీరోగా తెరకెక్కిస్తున్న సినిమా షూటింగ్ తో బిజీగా ఉండగా ఈ ఏడాది చివరిలో సెట్స్ పైకి వెళ్లబోయే తారక్-త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో సినిమాపై కొత్త వార్తలు ప్రచారం లోకి వస్తున్నాయి. వీరి కాంబినేషన్ లో ఒక పొలిటికల్ డ్రామా తెరకెక్కనుందని, 2018 ఆఖరికి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుందని, 2019 ఎన్నికల ప్రచార వేడి ఇరు తెలుగు రాష్ట్రాలలో తాండవం చేస్తున్న సమయంలో థియేటర్స్ లో ఈ పొలిటికల్ డ్రామాతో సందడి చేయటానికి తారక్ రంగం సిద్ధం చేస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే పొలిటికల్ డ్రామా అయినప్పటికీ త్రివిక్రమ్ శైలి కథనం తో కామెడీ, సెంటిమెంట్ ల మేళవింపుగా ఈ చిత్రం ఉండబోతుందని టాక్.

Similar News